Kannappa : దేవుడి సినిమాకు క్లీన్ యూ సర్టిఫికెట్ లేదా? ‘కన్నప్ప’కు సెన్సార్ యూ/ఏ ఎందుకు ఇచ్చారు?
తాజాగా నిన్నే కన్నప్ప సినిమా సెన్సార్ కూడా పూర్తయిందట.

Why Manchu Vishnu Kannappa Movie gets UA Certificate in Censor
Kannappa : మంచు విష్ణు దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న కన్నప్ప సినిమా జూన్ 27 విడుదల అవ్వనుంది. ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్, శరత్ కుమార్, మధుబాల, బ్రహ్మానందం, మోహన్ బాబు.. ఇలా చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ తో సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి. ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు.
తాజాగా నిన్నే కన్నప్ప సినిమా సెన్సార్ కూడా పూర్తయిందట. అయితే సెన్సార్ యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారని డైరెక్టర్ ముకేశ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. దేవుడి సినిమాకు క్లీన్ యు సర్టిఫికెట్ రావాలి కదా యూ/ఏ ఇచ్చారేంటి అనే ప్రశ్న ఎదురైంది.
దీనికి ముకేశ్ కుమార్ సమాధానమిస్తూ.. కన్నప్ప దేవుడి కథకు సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదు. కానీ ఈ సినిమా కన్నప్ప శివుడికి భక్తుడిగా మారి కన్ను ఇవ్వడం మాత్రమే కాదు. అసలు తిన్నడు ఎవరు? అతను చేసిన యుద్దాలు, అతని బ్యాక్ డ్రాప్ కూడా చూపిస్తున్నాం. అందుకే యాక్షన్ సీన్స్, రక్తం ఉండటంతోనే యూ/ఏ ఇచ్చారు. అంతే కానీ ఇందులో ఎవరి మనోభావాలు దెబ్బతీసే విధంగా సీన్స్ లేవు అని తెలిపారు.
అలాగే కన్నప్ప సినిమాకు సెన్సార్ దాదాపు 10 కట్స్ చెప్పిందట. ఇక ఈ సినిమాలో ఒక రొమాంటిక్ సాంగ్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఆ పాటను రిలీజ్ చేసారు. వీటివల్ల శివభక్తుడు కన్నప్ప సినిమాకు సెన్సార్ వాళ్ళు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారని తెలుస్తుంది. ఇక సెన్సార్ కటింగ్స్ కూడా పోను కన్నప్ప సినిమా మొత్తం నిడివి 3 గంటల 2 నిమిషాల 51 సెకండ్స్ వచ్చిందని సమాచారం.
Also Read : Rajamouli : జపాన్ వీడియో గేమ్ లో రాజమౌళి.. కొడుకుతో కలిసి.. జపాన్ వాళ్లకు మరింత దగ్గరై..