Amitabh Bachchan : పాపం ‘అమితాబ్ బచ్చన్’ అప్పడాలు అమ్ముకుంటాడట.. నాకు అమితాబ్ అప్పడాలే కావాలి.. డెన్మార్క్ మహిళ పోస్ట్ వైరల్..
అమితాబ్ బచ్చన్ గురించి ఆమె పెట్టిన పోస్ట్ చూసి అందరూ నవ్వుకుంటూ సరదా కామెంట్స్ పెడుతున్నారు.

Denmark Women Shares Funny Post on Amitabh Bachchan goes Viral
Amitabh Bachchan : తాజాగా ఫ్రెడెరిక్కె అనే ఓ డెన్మార్క్ మహిళ తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. అమితాబ్ బచ్చన్ గురించి ఆమె పెట్టిన పోస్ట్ చూసి అందరూ నవ్వుకుంటూ సరదా కామెంట్స్ పెడుతున్నారు. ఇంతకీ ఆమె పెట్టిన పోస్ట్ ఏంటో తెలుసా?
అమితాబ్ బచ్చన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఓ అప్పడాల ప్యాకెట్ నుంచి ఒక అప్పడం తీసుకొని కాల్చుకొని తిన్న వీడియో ఫ్రెడెరిక్కె తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఆ ప్యాకెట్ పై ఉన్న అమితాబ్ ఫోటో చూపిస్తూ.. ఇతను ఎవరు? ఇతను బెస్ట్ అప్పడం తయారుచేస్తున్నాడు. నేను ఈ అప్పడాలు నేపాల్ లో కొనుక్కున్నాను. ఇవి ఇక్కడ కోపెన్ హెగన్(డెన్మార్క్ రాజధాని)లో దొరకట్లేదు. నా దగ్గర ఉన్న అప్పడాలు అయిపోతున్నాయి. ఎవరికైనా ఈ అప్పడాలు ఎక్కడ దొరుకుతాయో తెలిస్తే చెప్పండి లేదా ఈ లెజెండరీ అప్పడాలు తయారు చేసే వ్యక్తి గురించి చెప్పండి. ప్లీజ్ హెల్ప్ చేయండి అని పోస్ట్ చేసింది.
Also Read : Allu Arjun : ‘ఐకాన్’ వదిలేసిన అల్లు అర్జున్.. కొత్త హీరోని వెతుక్కుంటారు కానీ వదిలేదే లేదు..
దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. అమితాబ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న అప్పడాల ప్యాకెట్ పై అమితాబ్ ఫోటో ఉంది. దీంతో ఈ మహిళ ఆ అప్పడాలు అతనే తయారు చేస్తాడని, అతని కంపెనీ అని ఊహించుకొని ఇలా పోస్ట్ చేయడం గమనార్హం. ఈ వీడియో వైరల్ అయి అమితాబ్ దాకా వెళ్తే ఆయన ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. ఈ వీడియో మీరు కూడా చూసేయండి..
Also Read : Rajamouli : జపాన్ వీడియో గేమ్ లో రాజమౌళి.. కొడుకుతో కలిసి.. జపాన్ వాళ్లకు మరింత దగ్గరై..