Allu Arjun : ‘ఐకాన్’ వదిలేసిన అల్లు అర్జున్.. కొత్త హీరోని వెతుక్కుంటారు కానీ వదిలేదే లేదు..

అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్. భారీ సినిమాలే లైనప్ చేస్తున్నారు.

Allu Arjun : ‘ఐకాన్’ వదిలేసిన అల్లు అర్జున్.. కొత్త హీరోని వెతుక్కుంటారు కానీ వదిలేదే లేదు..

Allu Arjun Leaves Dil Raju Venu Sriram Icon Movie

Updated On : June 25, 2025 / 6:50 AM IST

Allu Arjun : అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్. భారీ సినిమాలే లైనప్ చేస్తున్నారు. అయితే గతంలో అల్లు అర్జున్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో ఐకాన్ అనే టైటిల్ తో సినిమాని ప్రకటించారు. కానీ అప్పుడున్న పరిస్థితుల వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. అప్పుడు డైరెక్టర్ వకీల్ సాబ్ తో, అల్లు అర్జున్ అలవైకుంఠపురంలో సినిమాతో బిజీ అవ్వడంతో ఈ సినిమా పక్కన పెట్టేసారు.

పుష్పతో అల్లు అర్జున్ స్టార్ డమ్ పెరగడంతో ఐకాన్ లాంటి రీజనల్ ప్రాజెక్ట్స్ అసలు ముట్టుకునే ఆలోచనలో కూడా లేరు. దీంతో ఐకాన్ ప్రాజెక్టు ని అల్లు అర్జున్ వదిలేశారని టాలీవుడ్ లో క్లారిటీ వచ్చేసింది. అయితే దిల్ రాజు మాత్రం ఐకాన్ ప్రాజెక్టు ని వదల్లేదు అంట.

Also Read : Allu Arjun – Atlee : ముంబైలో సెట్.. ఏకంగా 3 నెలలు షూట్.. అల్లు అర్జున్ అట్లీ సినిమా లేటెస్ట్ అప్డేట్..

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దిల్ రాజు మాట్లాడుతూ.. ఐకాన్ సినిమా ఉంటుంది. కాకపోతే ఇందులో అల్లు అర్జున్ ఉండడు. యాక్షన్ డ్రామాతో పాటు హ్యూమన్ ఎమోషన్స్ తో ఈ కథ ఉంటుంది అని తెలిపారు. దీంతో వేరే హీరోతో ఐకాన్ సినిమా తీస్తారని తెలుస్తుంది. అయితే అల్లు అర్జున్ ప్రస్తుతం ఐకాన్ స్టార్ కాబట్టి మరి ఐకాన్ అనే టైటిల్ వేరే హీరోకి ఇస్తారా అనేది అనుమానమే.

ప్రస్తుతం వేణు శ్రీరామ్ నితిన్ తమ్ముడుతో బిజీగా ఉన్నాడు. అది రిలీజయ్యాక ఐకాన్ టైటిల్ మార్చి ఆ సినిమా మీద వర్క్ చేస్తారని తెలుస్తుంది. మరి అల్లు అర్జున్ ఓకే చేసిన కథని ఏ హీరో చేస్తాడో చూడాలి.

Also Read : Nikhil – Yashmi : యష్మితో రిలేషన్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన నిఖిల్.. ఫ్యాన్స్ కి ఆల్రెడీ చెప్పా..