Allu Arjun – Atlee : ముంబైలో సెట్.. ఏకంగా 3 నెలలు షూట్.. అల్లు అర్జున్ అట్లీ సినిమా లేటెస్ట్ అప్డేట్..

రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్ చేసేందుకు టైమ్‌ ఫిక్స్‌ చేసిన డైరెక్టర్‌ అట్లీ ఇటీవల ఆల్రెడీ హైదరాబాద్‌కి వచ్చివెళ్లారు.

Allu Arjun – Atlee : ముంబైలో సెట్.. ఏకంగా 3 నెలలు షూట్.. అల్లు అర్జున్ అట్లీ సినిమా లేటెస్ట్ అప్డేట్..

Allu Arjun Atlee Movie Shooting Planned in Mumbai

Updated On : June 24, 2025 / 9:39 PM IST

Allu Arjun – Atlee : సినిమా అనౌన్స్‌మెంట్‌తోనే గ్లోబల్‌ వైడ్ అటెన్షన్‌ క్రియేట్‌ చేసింది అల్లు అర్జున్‌-అట్లీ సినిమా. సైన్స్‌ ఫిక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ ఫైనల్‌ స్టేజ్‌లో ఉండగానే ముంబైలో చాలా సైలెంట్‌గా పూజా సెర్మనీ కంప్లీట్‌ చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఇక రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్ చేసేందుకు టైమ్‌ ఫిక్స్‌ చేసిన డైరెక్టర్‌ అట్లీ ఇటీవల ఆల్రెడీ హైదరాబాద్‌కి వచ్చివెళ్లారు.

అల్లు అర్జున్‌ కూడా ఇప్పటికే చాలా సార్లు హైదరాబాద్‌ టూ ముంబై చక్కర్లు కొడుతూవచ్చారు. కానీ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ అయ్యిందని ఎక్కడా అఫీషియల్ కన్ఫర్మేషన్‌ లేదు. దీంతో షూటింగ్‌ ఎప్పుడు స్టార్ట్‌ చేస్తారని అడుగుతున్నారు బన్నీ ఫ్యాన్స్‌. ఇంతకాలం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ కోసం చాలా టైమ్‌ తీసుకున్న బన్నీ-అట్లీ ఇక లేట్‌ చేయకూడదని డిసైడ్‌ అయ్యారు.

Also Read : Thammudu : ‘తమ్ముడు’ సినిమాలో నితిన్ మేనకోడలుగా నటించిన పాప ఎవరో తెలుసా? ఆ డైరెక్టర్ కూతురు..

పక్కా ప్లానింగ్‌తో ఫస్ట్‌ ఫెడ్యూల్‌కి టైమ్‌ ఫిక్స్‌ చేశారు డైరెక్టర్‌ అట్లీ. నెక్స్ట్‌ మంత్‌ నుంచి ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ముంబైలో స్టార్ట్‌ కానుంది. దీని కోసం ముంబైలో ప్రత్యేకంగా సెట్ వేసారట. ముంబైలో వేసిన భారీ సెట్‌లో 3 నెలలపాటు ఫస్ట్‌ షెడ్యూల్‌ని ప్లాన్ చేశారట డైరెక్టర్‌ అట్లీ. ఈ షెడ్యూల్‌లోనే అల్లు అర్జున్‌పై కొన్ని యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తారు. ఇక 3 మంత్స్‌ ఫస్ట్‌ షెడ్యూల్‌ తర్వాత బన్నీ-అట్లీ టీమ్‌ మొత్తం వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ కోసం అమెరికా వెళ్తుందని సమాచారం.

అల్లు అర్జున్‌-అట్లీ ప్రాజెక్ట్‌ని భారీ బడ్జెట్‌తో గ్రాండియర్‌ స్కేల్‌లో ప్రొడ్యూస్‌ చేస్తోంది సన్‌ పిక్చర్స్‌. హాలీవుడ్‌ మేకింగ్‌ స్టయిల్‌తో విజువల్‌ వండర్‌గా సినిమాని ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్‌ అట్లీ. సైన్స్‌ ఫిక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బన్నీ డిఫరెంట్‌ గెటప్స్‌లో కనిపించనున్నారు. ఇందులో ఒకటి కంప్లీట్‌గా నెగిటివ్‌ రోల్‌ ఉండే చాన్సుందంటున్నారు జనాలు. ఫీమేల్‌ లీడ్‌కి ఎక్కువుగా స్కోప్‌ ఉన్న ఈ సినిమాలో ఆల్రెడీ దీపిక పదుకొన్‌ ఫైనల్‌ అవ్వగా తర్వలోనే మృణాల్‌ ఠాకూర్‌కి సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ ఉంటుందని తెలుస్తోంది. అయితే టాలీవుడ్ కి చెందిన అల్లు అర్జున్, తమిళ్ కి చెందిన అట్లీ ఇటు హైదరాబాద్, అటు చెన్నై కాకుండా ముంబైలో సెట్ వేసి షూటింగ్ చేయడం గమనార్హం.

Also Read : Venkatesh : మొన్నటిదాకా ఒక్క సినిమా కూడా లేదని టాక్.. ఇప్పుడు చేతిలో అరడజను ప్రాజెక్ట్స్..