Thammudu : ‘తమ్ముడు’ సినిమాలో నితిన్ మేనకోడలుగా నటించిన పాప ఎవరో తెలుసా? ఆ డైరెక్టర్ కూతురు..

లయకు కూతురిగా, నితిన్ కి మేనకోడలుగా ఈ సినిమాలో ఒక పాప నటిస్తుంది.

Thammudu : ‘తమ్ముడు’ సినిమాలో నితిన్ మేనకోడలుగా నటించిన పాప ఎవరో తెలుసా? ఆ డైరెక్టర్ కూతురు..

Do You Know about Child Artist Acted in Nithiin Thammudu Movie

Updated On : June 24, 2025 / 8:28 PM IST

Thammudu : నితిన్ తమ్ముడు సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా జులై 4 రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాతో ఒకప్పటి హీరోయిన్ లయ రీ ఎంట్రీ ఇస్తుంది. లయ ఈ సినిమాలో నితిన్ కి అక్క పాత్రలో నటిస్తుంది. లయకు కూతురిగా, నితిన్ కి మేనకోడలుగా ఈ సినిమాలో ఒక పాప నటిస్తుంది.

ఈ సినిమాలో నితిన్ కి మేనకోడలుగా నటిస్తున్న పాప పేరు దీత్య. ఈ పాప ఎవరో కాదు తమ్ముడు సినిమా దర్శకుడు వేణు శ్రీరామ్ కూతురే. వేణు శ్రీరామ్ గతంలో పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ తర్వాత ఇప్పుడు నితిన్ తో తమ్ముడు సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాలో పాప పాత్రలో తన కూతురు దీత్యనే నటింపచేస్తున్నాడు.

Also Read : Venkatesh : మొన్నటిదాకా ఒక్క సినిమా కూడా లేదని టాక్.. ఇప్పుడు చేతిలో అరడజను ప్రాజెక్ట్స్..

ఇప్పటికే దీత్య కూడా ప్రమోషన్స్ లో పాల్గొని తన క్యూట్ క్యూట్ మాటలతో మెప్పిస్తుంది. పలు ఇంటర్వ్యూలు కూడా ఇస్తుంది. ఓ ఇంటర్వ్యూలో తన తండ్రిలాగే తనకు కూడా పవన్ కళ్యాణ్ ఫేవరేట్ హీరో అని చెప్పింది. ఈ సినిమా తర్వాత కూడా దీత్య సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కొనసాగే అవకాశం ఉందని తెలుస్తుంది. తమ్ముడు సినిమాలో లయకు కూతురిగా, నితిన్ కి మేనకోడలుగా దీత్య ఏ రేంజ్ లో మెప్పించిందో చూడాలి.

Do You Know about Child Artist Acted in Nithiin Thammudu Movie

Also Read : Nikhil – Yashmi : యష్మితో రిలేషన్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన నిఖిల్.. ఫ్యాన్స్ కి ఆల్రెడీ చెప్పా..