Nikhil – Yashmi : యష్మితో రిలేషన్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన నిఖిల్.. ఫ్యాన్స్ కి ఆల్రెడీ చెప్పా..

బిగ్ బాస్ లో నిఖిల్ నటి యష్మితో బాగా క్లోజ్ అవ్వడం, బయట కూడా వీరిద్దరూ కలిసి షోలో పాల్గొనడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారేమో అని రూమర్స్ వచ్చాయి.

Nikhil – Yashmi : యష్మితో రిలేషన్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన నిఖిల్.. ఫ్యాన్స్ కి ఆల్రెడీ చెప్పా..

Nikhil Maliyakkal Gives Clarity on Relation with Yashmi Gowda

Updated On : June 24, 2025 / 6:53 PM IST

Nikhil – Yashmi : గోరింటాకు సీరియల్ తో ఫేమ్ తెచ్చుకున్నాడు నిఖిల్. ఆ తర్వాత బిగ్ బాస్ తో మరింత వైరల్ అయ్యాడు. బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ గా నిలిచాడు. ప్రస్తుతం నిఖిల్ పలు సీరియల్స్, షోలతో బిజీగానే ఉన్నాడు. గతంలో నిఖిల్ కావ్యతో రిలేషన్ లో ఉన్నాడని అంతా అనుకున్నారు. ఇండైరెక్ట్ గా కావ్య – నిఖిల్ కూడా చెప్పారు. కానీ బిగ్ బాస్ లో వీరిద్దరికి బ్రేకప్ అయినట్టు ఇండైరెక్ట్ గా తెలిపాడు నిఖిల్.

అయితే బిగ్ బాస్ లో నిఖిల్ నటి యష్మితో బాగా క్లోజ్ అవ్వడం, బయట కూడా వీరిద్దరూ కలిసి షోలో పాల్గొనడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారేమో అని రూమర్స్ వచ్చాయి.

Also Read : Nagababu : నిహారిక విడాకుల విషయం.. చాన్నాళ్లకు స్పందించిన నాగబాబు.. మా నిర్ణయం తప్పయింది.. వరుణ్ ని అలా అడిగాను..

తాజాగా నిఖిల్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై మాట్లాడుతూ.. యష్మి నాకు ఫ్రెండ్ మాత్రమే. మంచి ఫ్రెండ్. కొంతమంది ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో మా ఇద్దరిపై పేజీలు పెట్టి ఎడిట్స్ చేసి పెడతారు. అలా పెట్టొద్దు అని నేను ఒక పోస్ట్ కూడా పెట్టాను. వర్క్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు. మా ఇద్దరి వర్క్ ని ఎంకరేజ్ చేయండి. కానీ పర్సనల్ లైఫ్ ఎవరిది వాళ్లదే. ఇలాంటివి చూసి నాకు బాధ అనిపిస్తుంది. మేము ఇద్దరం సింగిల్ గా ఉండి ఏదైనా షో చేస్తే వాళ్ళు అలా అనేసుకుంటున్నారు. దానివల్ల భవిష్యత్తులో సమస్యలు కూడా రావొచ్చు అని తెలిపాడు. దీంతో యష్మి – నిఖిల్ కేవలం ఫ్రెండ్స్ మాత్రమే, వాళ్ళ ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదు అని క్లారిటీ ఇచ్చాడు.

Also See : Deviyani Sharma : టెన్నిస్ కోర్ట్ లో షార్ట్ స్కర్ట్ లో.. దేవియాని హాట్ పోజులు..