Nagababu : నిహారిక విడాకుల విషయం.. చాన్నాళ్లకు స్పందించిన నాగబాబు.. మా నిర్ణయం తప్పయింది.. వరుణ్ ని అలా అడిగాను..

తాజాగా నాగబాబు నిహారిక విడాకుల అంశం గురించి స్పందించారు.

Nagababu : నిహారిక విడాకుల విషయం.. చాన్నాళ్లకు స్పందించిన నాగబాబు.. మా నిర్ణయం తప్పయింది.. వరుణ్ ని అలా అడిగాను..

Nagababu Reacts on Niharka Divorce Issue

Updated On : June 24, 2025 / 5:32 PM IST

Nagababu : నాగబాబు కూతురు నిహారిక గతంలో చైతన్య జొన్నలగడ్డ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని కొన్నాళ్ళకు విడాకులు తీసుకొని విడిపోయిన సంగతి తెలిసిందే. గతంలో నిహారిక, చైతన్య ఈ విడాకులపై స్పందించారు. తాజాగా నాగబాబు నిహారిక విడాకుల అంశం గురించి స్పందించారు.

నాగబాబు ఓ ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో నాగబాబు మాట్లాడుతూ.. వరుణ్ తేజ్ వచ్చి లావణ్యని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని చెప్పడంతో ఆమెతో హ్యాపీగా ఉంటావా? భవిష్యత్తులో ఇబ్బందులు వస్తే ఏం చేస్తావ్ అని అడిగాను. ఆమెతో హ్యాపీగా ఉంటాను, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా చూసుకుంటాను అని చెప్పాడు. వాళ్లిద్దరూ ప్రస్తుతం హ్యాపీగా ఉన్నారు.

Also Read : 8 Vasanthalu : సినిమా థియేటర్లో ఉండగానే ఓటీటీలో చూడమని చెప్పిన కెమెరామెన్.. ఓటీటీలోనే బాగుంటుంది అంటూ.. షాక్ అయిన మూవీ యూనిట్..

కానీ నిహారిక విషంలో మా నిర్ణయం తప్పయింది. మేమే సరిగా అంచనా వేయలేకపోయాం. అది మా తప్పు కూడా. ప్రపోజల్ వచ్చింది. నిహారికకు చెప్తే తనకు ఇష్టమే అని ఒప్పుకుంది. కానీ పెళ్లి తర్వాత వారిద్దరికీ కొన్ని విషయాల్లో బేధాభిప్రాయాలు వచ్చాయి. విడిపోవాలని అనుకున్నారు. కలిసి ఉండమని నేను బలవంతం చేయలేదు. వాళ్లకు కలిసి ఉండలేం అనిపించింది, ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. ప్రస్తుతం ఆమె సినిమా నిర్మాణం మీద ఫోకస్ పెట్టింది. భవిష్యత్తులో ఎవర్నైనా పెళ్లి చేసుకుంటుందేమో చూడాలి అని అన్నారు.