8 Vasanthalu : సినిమా థియేటర్లో ఉండగానే ఓటీటీలో చూడమని చెప్పిన కెమెరామెన్.. ఓటీటీలోనే బాగుంటుంది అంటూ.. షాక్ అయిన మూవీ యూనిట్..
తాజాగా ఓ సినిమాటోగ్రాఫర్ తమ సినిమాని ఓటీటీలో చూడండి అని చెప్పడం గమనార్హం.

8 Vasanthalu Cinematographer Viswanath Reddy says Watch this Movie in OTT Comments goes Viral
8 Vasanthalu : అసలే జనాలు థియేటర్స్ కి రావట్లేదు అని సినిమా వాళ్లంతా వాపోతున్నారు. అయినా ఓటీటీలో నెల రోజులకే సినిమాని తెస్తున్నారు. ఆ నెల రోజులు అయినా థియేటర్లో సినిమా ఉంటుందా అంటే టికెట్ రేట్లు పెంచేస్తున్నారు. థియటర్స్ లో సినిమా అనుభవం బాగుంటుంది అని ఫీల్ అవుతారు. అందుకే మూవీ యూనిట్స్ కూడా థియేటర్ కి వచ్చి చూడండి అనే చెపుతారు.
కానీ తాజాగా ఓ సినిమాటోగ్రాఫర్ తమ సినిమాని ఓటీటీలో చూడండి అని చెప్పడం గమనార్హం. ఇటీవల అనంతిక మెయిన్ లీడ్ లో ఫణింద్ర నర్సేట్టి దర్శకత్వంలో 8 వసంతాలు అనే సినిమా రిలీజయింది. జూన్ 20న ఈ సినిమా రిలీజయింది. సినిమా అంతా డైలాగ్స్ కవితల రూపంలో మాత్రమే ఉండటంతో ఈ సినిమా కొద్దిపాటి ఆడియన్స్ కే కనెక్ట్ అయింది. అయితే సినిమా థియేటర్స్ లో రిలీజయి నాలుగు రోజులు కూడా కాలేదు.
Also Read : Mukesh Kumar Singh : రాజమౌళి, అమీర్ ఖాన్ కి పోటీగా ‘కన్నప్ప’ డైరెక్టర్.. వర్కౌట్ అవుతుందా?
ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించగా ఈ ప్రెస్ మీట్ లో 8 వసంతాలు సినిమాటోగ్రాఫర్ విశ్వనాధ్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమా త్వరలో నెట్ ఫ్లిక్స్ లో వస్తుంది. థియేటర్ చూసిన ఎక్స్‌పీరియన్స్ కంటే ఇంకా బెటర్ ఎక్స్‌పీరియన్స్ నెట్ ఫ్లిక్స్ లో ఉండబోతుంది. క్వాలిటీ నెట్ ఫ్లిక్స్ లో ఇంకా బాగుంటుంది అని తెలిపాడు. దీంతో మూవీ యూనిట్ షాక్ అయ్యారు. థియేటర్లో రిలీజయిన నాలుగు రోజులకే ఓటీటీలో చూడండి, థియేటర్ అనుభవం కంటే ఓటీటీ అనుభవం బాగుంటుంది అని చెప్పడంతో ఆశ్చర్యపోయారు.
అసలు అలా ఎవరైనా చెప్తారా? ఇలా చెప్పాక ఇంక థియేటర్ కి ఎందుకు వస్తారు? ఓటీటీలోనే చూసుకుంటారు కదా అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. అయితే విశ్వనాధ్ తన సినిమాటోగ్రఫీ విజువల్స్, కలర్ గ్రేడింగ్ ఓటీటీలో ఇంకా చాలా బాగా కనిపిస్తాయి అని చెప్పడానికే అలా చెప్పారని అంటున్నారు. ఏది ఏమైనా ఒక సినిమా థియేటర్లో రిలీజయిన నాలుగు రోజులకే ఓటీటీలో చూడమని చెప్పడం తప్పే, మళ్ళీ వీళ్ళే థియేటర్స్ కి జనాలు రావట్లేదు అంటారు అని పలువురు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.
Also Read : The Paradise : నాని పారడైజ్ సినిమాలో విలన్ ఎవరో తెలుసా? ఆ రూమర్ నిజమే..