Mukesh Kumar Singh : రాజమౌళి, అమీర్ ఖాన్ కి పోటీగా ‘కన్నప్ప’ డైరెక్టర్.. వర్కౌట్ అవుతుందా?

ముకేశ్ కుమార్ నేడు మీడియాతో మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయం తెలిపారు.

Mukesh Kumar Singh : రాజమౌళి, అమీర్ ఖాన్ కి పోటీగా ‘కన్నప్ప’ డైరెక్టర్.. వర్కౌట్ అవుతుందా?

Kannappa Director Mukesh Kumar Singh Wants to Direct Movie Like Aamir Khan and Rajamouli

Updated On : June 24, 2025 / 3:51 PM IST

Mukesh Kumar Singh : మంచు విష్ణు కన్నప్ప సినిమా జూన్ 27 రిలీజ్ కాబోతుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ ముకేశ్ కుమార్ నేడు మీడియాతో మాట్లాడారు. బాలీవుడ్ లో సూపర్ హిట్ సీరియల్స్ మహాభారత, రామాయణ, జై హనుమాన్ లను తెరకెక్కించిన ముకేశ్ కుమార్ ఇప్పుడు కన్నప్ప సినిమాతో వెండితెరకు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

ముకేశ్ కుమార్ నేడు మీడియాతో మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయం తెలిపారు. ముకేశ్ కుమార్.. నెక్స్ట్ నేను మహాభారతం సినిమా చేయబోతున్నాను. మూడు భాగాలుగా ఆ సినిమాని తెరకెక్కిస్తాను. బడ్జెట్, నటీనటులు అన్ని విషయాలు కన్నప్ప రిలీజ్ తర్వాతే మాట్లాడతాను. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ఆల్మోస్ట్ పూర్తయింది అని తెలిపారు.

Also Read : Nagababu : అమ్మ ఆరోగ్యం బాగానే ఉంది.. అవన్నీ తప్పుడు వార్తలు.. నాగబాబు క్లారిటీ..

అమీర్ ఖాన్ కూడా ఇటీవల.. మహాభారతం సినిమాని తెరకెక్కిస్తున్నాను అని, ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది అని, చాలామంది స్టార్స్ ఈ సినిమాలో నటిస్తారు, ఇద్దరు ముగ్గురు డైరెక్టర్స్ దీనిని తెరకెక్కిస్తారని తెలిపాడు. మన రాజమౌళి కూడా తన లైఫ్ డ్రీం మహాభారతం సినిమా అని, కొన్ని భాగాలుగా ఆ సినిమా తీస్తానని, అదే నా చివరి సినిమా అవుతుందని గతంలోనే తెలిపారు.

ఇప్పుడు కన్నప్ప డైరెక్టర్ కూడా మహాభారతం సినిమాని తెరకెక్కిస్తాను అని చెప్పడంతో మరి రాజమౌళి – అమీర్ ఖాన్ లకు పోటీగా వస్తారా? వీరి ముగ్గురిలో ఎవరు ఫస్ట్ మహాభారతం సినిమా తీస్తారు అని చర్చగా మారింది.

Also Read : The Paradise : నాని పారడైజ్ సినిమాలో విలన్ ఎవరో తెలుసా? ఆ రూమర్ నిజమే..