Nagababu : అమ్మ ఆరోగ్యం బాగానే ఉంది.. అవన్నీ తప్పుడు వార్తలు.. నాగబాబు క్లారిటీ..
తాజాగా నాగబాబు ఈ వార్తలపై స్పందిస్తూ ట్వీట్ చేసాడు.

Nagababu Gives Clarity on her Mother Anjana Devi Health Issue Rumors
Nagababu : నేడు ఉదయం చిరంజీవి తల్లి అనారోగ్యానికి గురైందని, పవన్ కళ్యాణ్ కేబినెట్ మీటింగ్ మధ్యలో హైదరాబాద్ వెళ్లారని, చిరంజీవి తల్లి అంజనా దేవి ఆరోగ్యం విషమంగా ఉందని వార్తలు వచ్చాయి. తాజాగా నాగబాబు ఈ వార్తలపై స్పందిస్తూ ట్వీట్ చేసాడు.
Also Read : The Paradise : నాని పారడైజ్ సినిమాలో విలన్ ఎవరో తెలుసా? ఆ రూమర్ నిజమే..
నాగబాబు ట్విట్టర్లో.. అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది. ఈ విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతుంది. ఆమె ప్రస్తుతం బాగానే ఉన్నారు అని తెలుపుతూ అంజనాదేవి ఆరోగ్యంపై వచ్చే వార్తలకు చెక్ పెట్టారు.
అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది.
There is some inaccurate information being circulated,but she is absolutely fine.— Naga Babu Konidela (@NagaBabuOffl) June 24, 2025
అలాగే చిరంజీవి పీఆర్ టీమ్ స్పందిస్తూ.. చిరంజీవి తల్లికి సీరియస్ అని వస్తున్న వార్తల్లో నిజం లేదు. చిరంజీవి షామీర్ పేట్ లో షూటింగ్ లో ఉన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్సనల్ వర్క్ మీద హైదరాబాద్ వస్తున్నారు. దయచేసి ఫేక్ న్యూస్ లు స్ప్రెడ్ చెయ్యవద్దు అని తెలిపారు.