The Paradise : నాని పారడైజ్ సినిమాలో విలన్ ఎవరో తెలుసా? ఆ రూమర్ నిజమే..

కొన్ని రోజుల క్రితం నాని పారడైజ్ సినిమాలో విలన్ గురించి ఒకరి పేరు వినిపిస్తూ రూమర్స్ వచ్చాయి.

The Paradise : నాని పారడైజ్ సినిమాలో విలన్ ఎవరో తెలుసా? ఆ రూమర్ నిజమే..

Nani The Paradise Movie Villain Rumors goes Viral Kannappa Director Revealed

Updated On : June 24, 2025 / 3:33 PM IST

The Paradise : వరుస హిట్ సినిమాలతో నిర్మాతగా, హీరోగా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నాడు నాని. ఇటీవల హిట్ 3 సినిమాతో మెప్పించగా ప్రస్తుతం పారడైజ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. దసరాతో నానికి పెద్ద కమర్షియల్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది పారడైజ్ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ తో సినిమాపై భారీ హైప్ వచ్చింది.

పారడైజ్ సినిమా వచ్చే సంవత్సరం మార్చ్ 26 రిలీజ్ చేయబోతున్నారు ప్రకటించారు. గ్లింప్స్ చుసిన తర్వాత ఈ సినిమా దసరా కంటే మరింత రా & రస్టిక్ గా ఉండబోతుందని ఒక అవగాహన వచ్చింది. దీంతో ఈ సినిమాలో విలన్ ఎవరో అని చర్చగా మారింది. కొన్ని రోజుల క్రితం నాని పారడైజ్ సినిమాలో విలన్ గురించి ఒకరి పేరు వినిపిస్తూ రూమర్స్ వచ్చాయి. తాజాగా కన్నప్ప డైరెక్టర్ ముకేశ్ కుమార్ నాని పారడైజ్ సినిమాలో విలన్ ఎవరో చెప్పేసాడు.

ఇప్పటివరకు ఎలాంటి ప్రమోషన్స్ లేని ‘తమ్ముడు’ .. ఇప్పటికైనా గేర్ మారుస్తారా?

విష్ణు కన్నప్ప సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ముకేశ్ కుమార్ నేడు మీడియాతో మాట్లాడుతూ మోహన్ బాబు గారు నాని కి ఆపోజిట్ గా నటిస్తున్నారు. ఒక పవర్ ఫుల్ రోల్, నేను షూట్ లో చూసాను, ఆయన ప్రజెన్స్ అద్భుతంగా ఉంటుంది అని చెప్పడంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ప్రస్తుతం నాని పారడైజ్ ఒకటే సినిమా చేస్తున్నాడు. అంటే మోహన్ బాబు ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తుంది.

మోహన్ బాబు గతంలో విలన్ గా కూడా అనేక సినిమాల్లో నటించి మెప్పించాడు. మోహన్ బాబు ఒక పవర్ ఫుల్ విలన్, నెగిటివ్ షెడ్ రోల్ చేసి చాలా కాలం అయింది. ఇప్పుడు నాని పారడైజ్ సినిమాలో విలన్ అని తెలియడంతో మోహన్ బాబుని ఏ రేంజ్ లో చూపిస్తారో, డైలాగ్ కింగ్ నెగిటివ్ షేడ్స్ లో మరోసారి ఎలా కనిపిస్తారో అని ఆసక్తి నెలకొంది. అసలు మోహన్ బాబుని విలన్ గా తీసుకోవాలని డైరెక్టర్ కి వచ్చిన ఆలోచనని అభినందిస్తున్నారు.

Also Read : Rishabh Pant : టీమ్ఇండియా వైస్ కెప్టెన్ రిష‌బ్ పంత్‌కు భారీ షాక్ ఇచ్చిన ఐసీసీ..