ఇప్పటివరకు ఎలాంటి ప్రమోషన్స్ లేని ‘తమ్ముడు’ .. ఇప్పటికైనా గేర్ మారుస్తారా?
హీరో నితిన్‌కు ఇప్పుడు 'తమ్ముడు' సినిమా సక్సెస్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అయినా సినిమా యూనిట్ నుంచి కనీస ప్రమోషన్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం అభిమానులను ఆశ్చర్యపరుస్తుందట. సాధారణంగా పెద్ద సినిమాలకు ప్రీ-రిలీజ్ ఈవెంట్స్, టీజర్లు, పాటలు, సోషల్ మీడియా క్యాంపెయిన్లతో హడావుడి చేస్తారు. కానీ 'తమ్ముడు' సినిమా విషయంలో ఈ హైప్ కనిపించడం లేదు. ట్రైలర్ రిలీజ్ తర్వాత కూడా పెద్దగా బజ్ క్రియేట్ కాకపోవడంతో నిర్మాతలు ఏం ప్లాన్ చేస్తున్నారోనని నెటిజన్లు ఆరాస్తున్నారు.