Rishabh Pant : టీమ్ఇండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్‌కు భారీ షాక్ ఇచ్చిన ఐసీసీ..
టీమ్ఇండియా వైస్‌కెప్టెన్ రిషబ్ పంత్‌కు ఐసీసీ షాకిచ్చింది.

ENG vs IND 1st Test Rishabh Pant punished by ICC for throwing ball
టీమ్ఇండియా వైస్‌కెప్టెన్ రిషబ్ పంత్‌కు ఐసీసీ షాకిచ్చింది. హెడింగ్లీలో ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు మ్యాచ్‌లో అంపైర్‌తో వాగ్వాదానికి దిగడంతో పంత్ ను మందలించింది. అంతేకాదండోయ్ అతడి ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్‌ను చేర్చింది.
ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.8ని పంత్ ఉల్లంఘించినట్లు ఐసీసీ తెలిపింది. చేసిన తప్పుతో పాటు విధించిన శిక్షను పంత్ అంగీకరించాడని, దీనిపై ఇక ఎలాంటి తదుపరి విచారణ ఉండదని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.
ENG vs IND : తొలి టెస్టు ఆఖరి రోజు ఆటపై కేఎల్ రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
అసలేం జరిగిందంటే?
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇన్నింగ్స్ 61 ఓవర్‌లో హ్యారీబ్రూక్, బెన్ స్టోక్స్‌లు బ్యాటింగ్ చేస్తుండగా.. బంతి ఆకారం దెబ్బతిందని పంత్ ఫిర్యాదు చేశాడు. వెంటనే బాల్‌ను మార్చాలని అంపైర్లుకు తెలిపాడు. అయితే.. అంపైర్లు బాల్ గేజ్ ద్వారా బంతి ఆకారాన్ని పరిశీలించారు. బంతి బాగానే ఉందని మార్చాల్సిన అవసరం లేదని చెప్పారు.
ఈ క్రమంలో పంత్ సహనం కోల్పోయాడు. బంతిని నేలకేసి బలంగా కొట్టాడు. మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్‌సన్‌కు ఆన్ ఫీల్డ్ అంపైర్లు ఈ విషయంపై ఫిర్యాదు చేయగా.. మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నారు.
Ishan Kishan : పాక్ ఆటగాడితో ఇషాన్ కిషన్ సంబురాలు.. వీడియో వైరల్..
రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శతక్కొట్టిన పంత్..
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ పంత్ సెంచరీలు బాదాడు. తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులు చేయగా రెండో ఇన్నింగ్స్‌లో 118 పరుగులు చేశాడు. ఈ క్రమంలో రెండు ఇన్నింగ్స్‌ల్లో శతకాలు బాదిన తొలి భారత వికెట్ కీపర్‌గా పంత్ చరిత్ర సృష్టించాడు.