Ishan Kishan : పాక్ ఆటగాడితో ఇషాన్ కిషన్ సంబురాలు.. వీడియో వైరల్..
పాకిస్తాన్ ఆటగాడితో టీమ్ఇండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ సంబురాలు చేసుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది

Ishan Kishan Involved In Rare India-Pakistan Moment
పహల్గామ్ ఉగ్రదాడి తరువాత భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. క్రికెట్‌లో ఐసీసీ టోర్నీల్లో మాత్రమే భారత్, పాకిస్తాన్ జట్లు తలపడుతుండగా.. ఉగ్రదాడి తరువాత ఏ టోర్నీలోనూ పాక్‌తో ఆడొద్దనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ ఆటగాడితో టీమ్ఇండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఆడుతూ కనిపించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఇంగ్లాండ్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. నాటింగ్‌హామ్‌షైర్ జట్టు తరుపున భారత ఆటగాడు ఇషాన్ కిషన్, పాక్ ప్లేయర్ మహ్మద్ అబ్బాస్ లు కలిసి ఆడుతున్నారు. యార్క్‌షైర్ తో మ్యాచ్‌లో అబ్బాస్ బౌలింగ్‌లో ప్రత్యర్థి బ్యాటర్ ఇచ్చిన క్యాచ్‌ను వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ చక్కగా పట్టుకున్నాడు. ఈ క్రమంలో అబ్బాస్, ఇషాన్ కిషన్ ఒకరినొకరు కౌగలించుకుని సంబురాలు చేసుకుంటూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ENG vs IND : చరిత్ర సృష్టించిన టీమ్ఇండియా.. 93 ఏళ్ల భారత టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా..
🎥 The perfect start!#NOTvYOR https://t.co/bReiSrPNDj pic.twitter.com/n8jJSZRuao
— Notts Outlaws (@TrentBridge) June 23, 2025
మెరిసిన ఇషాన్ కిషన్..
ఇక ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ అదరగొట్టాడు. 98 బంతుల్లో 12 ఫోర్లు, ఓ సిక్స్ సాయంతో 87 పరుగులు చేశాడు. దీంతో నాటింగ్‌హామ్‌షైర్ తొలి ఇన్నింగ్స్‌లో 487 పరుగులు చేసింది. ఆ తరువాత యార్క్‌షైర్ తొలి ఇన్నింగ్స్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.
ENG vs IND : వారెవ్వా జోరూట్.. రాహుల్ ద్రవిడ్ ప్రపంచ రికార్డు సమం..
కాగా.. ఇషాన్ కిషన్ నాటింగ్‌హామ్‌షైర్ తో స్వల్ప కాలిక ఒప్పందాన్ని చేసుకున్నాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు కైల్ వెర్రెయిన్ జాతీయ జట్టుకు ఆడేందుకు వెళ్లడంతో ఇషాన్ కిషన్‌ను రెండు మ్యాచ్‌ల కోసం నాటింగ్‌హామ్‌షైర్ తీసుకుంది.