ENG vs IND : చ‌రిత్ర సృష్టించిన టీమ్ఇండియా.. 93 ఏళ్ల భార‌త టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో తొలిసారి ఇలా..

టీమ్ఇండియా చారిత్రాత్మ‌క రికార్డును సృష్టించింది.

ENG vs IND : చ‌రిత్ర సృష్టించిన టీమ్ఇండియా.. 93 ఏళ్ల భార‌త టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో తొలిసారి ఇలా..

India score five Test tons in a match for the first time in history

Updated On : June 24, 2025 / 11:01 AM IST

టీమ్ఇండియా చారిత్రాత్మ‌క రికార్డును సృష్టించింది. ఓ టెస్టు మ్యాచ్‌లో భార‌త్ త‌రుపున ఐదు సెంచ‌రీలు న‌మోదు కావ‌డం ఇదే తొలిసారి. హెడింగ్లీ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు మ్యాచ్‌లో భార‌త్ ఈ ఘ‌న‌త సాధించింది. భార‌త జ‌ట్టు 1932 నుంచి టెస్టు క్రికెట్ ఆడుతుండ‌గా తొలిసారి ఈ రేర్ ఫీట్‌ను అందుకుంది.

గ‌తంలో ప‌లు సంద‌ర్భాల్లో టీమ్ఇండియా త‌రుపున నాలుగు శ‌త‌కాలు న‌మోదైన‌ సంద‌ర్భాలు ఉన్నాయి కానీ ఐదు శ‌త‌కాలు న‌మోదు కావ‌డం ఇదే మొద‌టి సారి. హెడింగ్లీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ (101), శుభ్‌మ‌న్‌ గిల్ (147), రిషబ్ పంత్ (134) శ‌త‌కాలు చేయ‌గా రెండో ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ (137), రిషబ్ పంత్ (118) సెంచ‌రీలు చేశారు.

ENG vs IND : వారెవ్వా జోరూట్‌.. రాహుల్ ద్ర‌విడ్ ప్ర‌పంచ రికార్డు స‌మం..

1955 తర్వాత విదేశీ గడ్డపై ఒకే టెస్టు మ్యాచ్‌లో ఐదు సెంచరీలు చేసిన పర్యాటక జట్టుగా భారత్ ఘ‌న‌త సాధించింది. 70 ఏళ్ల కిందట వెస్టిండీస్ ప‌ర్య‌ట‌న‌లో ఓ టెస్టు మ్యాచ్‌లో ఐదుగురు ఆసీస్ ఆట‌గాళ్లు సెంచ‌రీలు చేశారు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. నాలుగో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ న‌ష్ట‌పోకుండా 21 ప‌రుగులు చేసింది. క్రీజులో బెన్‌డ‌కెట్ (9), జాక్ క్రాలీ (12) లు ఉన్నారు. ఇంగ్లాండ్ విజ‌యానికి ఆఖ‌రి రోజు 350 ప‌రుగులు అవ‌స‌రం కాగా.. భార‌త జ‌ట్టు గెలుపుకు 10 వికెట్లు అవ‌స‌రం.

ENG vs IND : భార‌త్ 370 ప‌రుగుల‌ను కాపాడుకోగ‌ల‌దా? హెడింగ్లీలో అత్య‌ధిక ల‌క్ష్య ఛేద‌న ఎంతంటే..?

మ్యాచ్ స్కోరు వివ‌రాలు..
భార‌త్ మొద‌టి ఇన్నింగ్స్ – 471 ఆలౌట్‌
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ – 465 ఆలౌట్‌
భార‌త్ రెండో ఇన్నింగ్స్ – 364 ఆలౌట్‌