Rajamouli : జపాన్ వీడియో గేమ్ లో రాజమౌళి.. కొడుకుతో కలిసి.. జపాన్ వాళ్లకు మరింత దగ్గరై..

జపాన్ లో రాజమౌళికి కూడా ఫ్యాన్స్ ఏర్పడ్డారు. అక్కడ టెక్నిషియన్స్ కూడా రాజమౌళికి ఫిదా అయ్యారు.

Rajamouli : జపాన్ వీడియో గేమ్ లో రాజమౌళి.. కొడుకుతో కలిసి.. జపాన్ వాళ్లకు మరింత దగ్గరై..

Rajamouli Played Guest Role in Hideo Kojima Japan Video Game

Updated On : June 25, 2025 / 7:06 AM IST

Rajamouli : రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే రాజమౌళి తాజాగా జపాన్ వీడియో గేమ్ డెత్ స్ట్రాండింగ్ 2 లో కనిపించారు. రాజమౌళికి జపాన్ తో మంచి సంబంధాలు ఉన్నాయి. బాహుబలి, RRR సినిమాలను అక్కడ బాగా ప్రమోట్ చేసి హిట్ చేయడంతో జపాన్ లో రాజమౌళికి కూడా ఫ్యాన్స్ ఏర్పడ్డారు. అక్కడ టెక్నిషియన్స్ కూడా రాజమౌళికి ఫిదా అయ్యారు.

ఇటీవల రాజమౌళి, అతని కొడుకు కార్తికేయ జపాన్ లో స్టార్ వీడియో గేమ్ డిజైనర్, రైటర్, డైరెక్టర్, నిర్మాత హిదేవు కొజిమతో వీడియో కాల్ మాట్లాడిన ఫోటో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. గతంలోనే జపాన్ కి వెళ్ళినపుడు హిదేవు కొజిమ డైరెక్ట్ చేస్తున్న వీడియో గేమ్ లో కనిపించడానికి రాజమౌళి ఒప్పుకొని దానికి కావాల్సిన షూట్ కూడా పూర్తిచేసుకొని వచ్చాడు.

Also Read : Allu Arjun : ‘ఐకాన్’ వదిలేసిన అల్లు అర్జున్.. కొత్త హీరోని వెతుక్కుంటారు కానీ వదిలేదే లేదు..

ఈ వీడియో గేమ్ లో రాజమౌళి ది అడ్వెంచర్ గా, కార్తికేయ ది అడ్వెంచర్ సన్ పాత్రలలో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారట. ఇటీవలే ఆ వీడియో గేమ్ రిలీజయింది. దీంతో జపాన్ లో కూడా రాజమౌళి ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుగా లేదుగా అని అనుకుంటున్నారు ఫ్యాన్స్. ఈ వీడియో గేమ్ తో రాజమౌళి జపాన్ లో మరింత వైరల్ అవుతుండగా మహేష్ సినిమా ప్రమోషన్స్ కి బాగా కలిసొస్తుందని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.

 

Also Read : Mani Ratnam : ఈ ప్రయోగాలు వదిలేసి.. మళ్ళీ తనకు అచ్చొచ్చిన జానర్ కే వెళ్ళిపోతున్న మణిరత్నం..