Mani Ratnam : ఈ ప్రయోగాలు వదిలేసి.. మళ్ళీ తనకు అచ్చొచ్చిన జానర్ కే వెళ్ళిపోతున్న మణిరత్నం..

డైరెక్టర్‌ మణిరత్నం పేరు వినగానే ఎక్కువగా ఇంటెన్స్ డ్రామా ఉన్న సినిమాలు మంచి రొమాంటిక్ టచ్ ఉన్న సినిమాలు గుర్తుకువస్తాయి.

Mani Ratnam : ఈ ప్రయోగాలు వదిలేసి.. మళ్ళీ తనకు అచ్చొచ్చిన జానర్ కే వెళ్ళిపోతున్న మణిరత్నం..

Mani Ratnam wants to Direct again his Favorite Love genre

Updated On : June 24, 2025 / 9:44 PM IST

Mani Ratnam : థగ్‌లైఫ్ సినిమాతో ఆడియెన్స్‌ ముందుకు వచ్చి భారీ డిజాస్టర్‌ చూశారు డైరెక్టర్‌ మణిరత్నం. ఇండియాలో బెస్ట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న మణిరత్నం తన సినిమాల్లో మునుపటి స్పార్క్‌ను చూపించలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. పొన్నియన్‌ సెల్వన్‌ సిరీస్‌తో పర్వాలేదనిపించిన డైరెక్టర్‌ మణి థగ్‌లైఫ్‌ విషయంలో పూర్తిగా ఫెయిల్యూర్‌ అయ్యారనే కామెంట్స్‌ వినిపించాయి. దీంతో వీటన్నింటికి చెక్‌ పట్టాలంటే తనకు బాగా కలిసొచ్చిన లవ్‌ స్టోరీలపై ఫోకస్‌ పెట్టాలని డిసైడ్‌ అయ్యారట డైరెక్టర్‌ మణిరత్నం.

డైరెక్టర్‌ మణిరత్నం పేరు వినగానే ఎక్కువగా ఇంటెన్స్ డ్రామా ఉన్న సినిమాలు మంచి రొమాంటిక్ టచ్ ఉన్న సినిమాలు గుర్తుకువస్తాయి. కానీ రీసెంట్‌ టైమ్స్‌లో డైరెక్టర్‌ మణి చేసిన నవాబ్, పొన్నియన్ సెల్వన్ వన్ అండ్‌ టూ సినిమాలు, లేటెస్ట్‌గా రిలీజైన థగ్‌లైఫ్‌ ఈ సినిమాలన్నీ తన కంఫర్ట్‌ జోన్‌ నుంచి బయటికి వచ్చి చేసిన సినిమాలే. కానీ ఈ సినిమాలేవి బాక్సాఫీస్‌ దగ్గర పెద్దగా ఎఫెక్ట్‌ చూపించలేదు. ఆడియెన్స్‌ని ఏ మాత్రం ఆకట్టుకోలేదు కూడా. దీంతో డైరెక్టర్‌ మణిరత్నం మళ్లీ తన కంఫర్ట్‌ జోన్‌లోకి వచ్చేసి ఇంట్రెస్టింగ్‌ లవ్‌స్టోరీని ప్రజెంట్‌ ట్రెండ్‌కి తగ్గట్లు రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read : Thammudu : ‘తమ్ముడు’ సినిమాలో నితిన్ మేనకోడలుగా నటించిన పాప ఎవరో తెలుసా? ఆ డైరెక్టర్ కూతురు..

డైరెక్టర్‌ మణిరత్నం కెరీర్‌ బిగినింగ్‌లో వచ్చిన రోజా, బొంబాయి సినిమాల్లో ఎంత ఇంటెన్సివ్‌ డ్రామా ఉన్నా సినిమాలోని రొమాంటిక్‌ సీన్స్‌ మాత్రం నెక్స్ట్‌ లెవల్‌ అని చెప్పాలి. ఆ తర్వాత చేసిన దిల్‌ సే ఫెయిల్యూర్‌ అయినా సినిమాలోని లవ్‌ సీన్స్‌కి ఆడియెన్స్‌కి బాగా కనెక్ట్‌ అయ్యారు. ఇక సఖి సినిమాలోని లవ్‌ సీన్స్‌కి సపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. ఇలాంటి క్రేజీ లవ్‌స్టోరీలని డైరెక్ట్‌ చేసిన మణిరత్నం చివరిసారిగా ఓకే బంగారంతో సక్సెస్‌ చూశారు. డైరెక్టర్‌ మణిరత్నం లవ్‌స్టోరీలకి ఆడియెన్స్‌లో ఇప్పటకీ ఫుల్‌ క్రేజ్‌ ఉంది. దీంతో థగ్‌లైఫ్‌లో వన్‌ ఆఫ్‌ లీడ్‌ క్యారెక్టర్‌ చేసిన శింబుతోనే ఇంట్రస్టింగ్‌ లవ్‌ సబ్జెక్ట్‌తో కంబ్యాక్‌ ఇచ్చేందుకు డైరెక్టర్‌ మణిరత్నం ప్లాన్ చేస్తున్నారట. మరి తనకు అచ్చొచ్చిన జానర్లో మంచి లవ్ స్టోరీతో మణిరత్నం మళ్ళీ ప్రేక్షకులను మెప్పిస్తారా చూడాలి.

Also Read : Allu Arjun – Atlee : ముంబైలో సెట్.. ఏకంగా 3 నెలలు షూట్.. అల్లు అర్జున్ అట్లీ సినిమా లేటెస్ట్ అప్డేట్..