Fake Collections : మొన్న నాగవంశీ.. ఇవాళ దిల్ రాజు.. అన్ని ఫేక్ కలెక్షన్స్.. ఇప్పటికైనా ఫ్యాన్స్ మారతారా?
టాలీవుడ్ లో సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి, కలెక్షన్స్ తగ్గడానికి ముఖ్య కారణాల్లో ఫ్యాన్ వార్స్ ఒకటి.(Fake Collections)
Fake Collections
Fake Collections : టాలీవుడ్ లో సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి, కలెక్షన్స్ తగ్గడానికి ముఖ్య కారణాల్లో ఫ్యాన్ వార్స్ ఒకటి. ఈ విషయం అందరికి తెలిసిందే. పక్క హీరో సినిమా వస్తుందంటే ఆ సినిమా టీజర్, ట్రైలర్స్ రిలీజయినప్పటి నుంచే ట్రోల్స్ మొదలుపెడతారు ఇంకో హీరో అభిమానులు. ఓ హీరో సినిమా రేపు రిలీజ్ అంటే ఇవాళ నైట్ నుంచే ఆ సినిమా గురించి వ్యతిరేక ప్రచారం చేస్తారు ఇంకో హీరో ఫ్యాన్స్. దీంతో ఆ సినిమాకు చాలా ఎఫెక్ట్ అవుతుంది. అలా ఎఫెక్ట్ అయిన సినిమాలు ఇటీవల కాలంలో చాలా ఉన్నాయి.
అయితే ఆ ఫ్యాన్ వార్స్ వల్లే మేము సినిమాలకు ఎక్కువ కలెక్షన్స్, ఫేక్ కలెక్షన్స్ వేయాల్సి వస్తుందని నిర్మాతలు చెప్పినా ఫ్యాన్స్ వినట్లేదు. కొన్ని రోజుల క్రితం నాగవంశీ సినిమా కలెక్షన్స్ పోస్టర్స్ గురించి మాట్లాడుతూ.. అవన్నీ ఫేక్, కేవలం ఫ్యాన్స్ కోసమే ఆ పోస్టర్స్. రియల్ కలెక్షన్స్ కావు అని తను రిలీజ్ చేసిన ఓ స్టార్ హీరో సినిమా గురించి ప్రస్తావిస్తూ మాట్లాడారు.
Also Read : Madonna Sebastian : చీరకట్టులో మడోన్నా సెబాస్టియన్ మెరుపులు.. ఫొటోలు..
తాజాగా దిల్ రాజు కూడా ఈ కలెక్షన్స్ గురించి మాట్లాడుతూ.. సినిమా కలెక్షన్లకు, నిర్మాతలు వేస్తున్న పోస్టర్లకు సంబంధం లేదు. ఒకరిని చూసి ఒకరు పోస్టర్లు వేస్తున్నారు. ఆ హీరో కంటే ఈ హీరోకి ఎక్కువ వేయాలని ఫ్యాన్స్ అంటారు. కానీ అందులో ఎంత నిజం కలెక్షన్స్ అనేది మాకు తెలుసు. ఫ్యాన్ వార్స్ వల్ల కూడా సినిమాలకు ఎఫెక్ట్ అవుతుంది అని అన్నారు.
ఇలా నిర్మాతలే స్వయంగా మేము వేసే కలెక్షన్స్ ఫేక్ అని చెప్తున్నా ఇంకా హీరోల అభిమానులు మా హీరోకు ఎక్కువ కలెక్షన్స్ మా హీరోలకు ఎక్కువ కలెక్షన్స్ అని ఫేక్ పోస్టర్స్ కోసం సోషల్ మీడియాలో కొట్టుకుంటారు. నిర్మాతలు స్వయంగా చెప్పిన తర్వాత అయినా అభిమానులు మారుతారేమో చూడాలి. ఇప్పటికీ అభిమానులు కలెక్షన్స్ విషయంలో మా హీరో గొప్ప మా హీరో గొప్ప అని కొట్టుకోవడం ఆపకపోతే మరిన్ని సినిమాలకు ఆ ఎఫెక్ట్ ఉంటుంది.
