After Sankranthiki Vasthunnam Venkatesh Ready with almost Half Dozen Films
Venkatesh : విక్టరీ వెంకటేష్ ఇటీవల జనవరిలో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టారు. రీజనల్ సినిమాతో 300 కోట్లు కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. దీంతో ఫామ్ లోకి వచ్చిన వెంకీమామ వరుసగా సినిమాలు చేసేస్తాడు అని అనుకున్నారు. ఒకరిద్దరు దర్శకుల పేర్లు వినిపించినా ఏది ఫైనల్ కాలేదని ఇన్నిరోజులు అన్నారు.
సీనియర్ హీరో, పెద్ద హిట్ కొట్టాడు అయినా చేతిలో ఒక్క సినిమా ఇన్ని రోజులు లేకపోవడం ఏంటని ఆశ్చర్యపోయారు అంతా. కానీ ఇటీవల నెల రోజుల గ్యాప్ లోనే అరడజను ప్రాజెక్ట్స్ వెంకీమామ చేతిలోకి వచ్చాయని వినిపిస్తుంది.
Also Read : Nikhil – Yashmi : యష్మితో రిలేషన్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన నిఖిల్.. ఫ్యాన్స్ కి ఆల్రెడీ చెప్పా..
ప్రస్తుతం వెంకటేష్ చిరంజీవి – అనిల్ రావిపూడి సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నాడు. ఈ సినిమాకు ఒక వారం రోజులు డేట్స్ కూడా ఇచ్చాడని, త్వరలోనే షూటింగ్ లో జాయిన్ అవుతాడని సమాచారం. ఈ సినిమా 2026 సంక్రాంతికి రిలీజ్ కానుంది. దీని తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్టు నిర్మాత నాగవంశీ ప్రకటించారు. ఆ సినిమా 2026 సమ్మర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
అలాగే మలయాళం సూపర్ హిట్ దృశ్యం సినిమాలను వెంకటేష్ రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దృశ్యం 3 సినిమాని దర్శకుడు జీతూ జోసెఫ్ ఒకేసారి మలయాళం, తెలుగు, హిందీలో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాని 2026 చివర్లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్టు, ఆల్రెడీ స్క్రిప్ట్ కూడా పూర్తయిందని జీతూ జోసెఫ్ చెప్పాడు. దీంతో మరోసారి మీనాతో కలిసి థ్రిల్లర్ జానర్లో కనిపించబోతున్నాడు వెంకటేష్.
ఇది అయిన తర్వాత అనిల్ రావిపూడితో సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి సీక్వెల్ గా మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ తో సినిమా చేయబోతున్నాడు అని టాక్. దాన్ని 2027 సంక్రాంతికి తీసుకురావడానికి అనిల్ ప్లాన్ చేస్తున్నాడట. వీటితో పాటు ఆల్రెడీ నెట్ ఫ్లిక్స్ లో రానా నాయుడు రెండు సీజన్లు చేయడంతో ఓటీటీలో కూడా వెంకీమామకు ఆఫర్స్ వస్తున్నాయట. అమెజాన్, నెట్ ఫ్లిక్స్ ఓటీటీలలో త్వరలోనే ఒక సిరీస్ కి ఓకే చెప్పబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఎప్పట్నుంచో డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తో వెంకటేష్ ఒక సినిమా చేస్తారని రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. అలా ఒకేసారి వెంకీమామ దాదాపు అరడజను సినిమాలతో బిజీ అయిపోయారు.