Agent Movie To Bring Two Major Updates Soon
Agent Movie: అక్కినేని అఖిల్ నటిస్తున్న ది మోస్ట్ వెయిటెడ్ స్పై థ్రిల్లర్ మూవీ ‘ఏజెంట్’ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించగా, పాన్ ఇండియా మూవీగా ‘ఏజెంట్’ను తీసుకొస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్ ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి.
Agent Movie: రామకృష్ణా అంటూ బ్రేకప్ సాంగ్‌తో వస్తున్న ఏజెంట్
ఇక ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ సినిమా ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ ఇప్పటికే శరవేగంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఏజెంట్ మూవీ నుండి త్వరలోనే రెండు భారీ అప్డేట్స్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోందట. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఏప్రిల్ 23న గ్రాండ్‌గా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోందట.
Agent Movie: ప్రమోషన్స్ స్టార్ట్ చేసేందుకు డేట్ ఫిక్స్ చేసిన ‘ఏజెంట్’
అంతేగాక, ఈ సినిమా ట్రైలర్‌ను ఏప్రిల్ 18న కాకినాడలో గ్రాండ్ లాంచ్ చేయబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ రెండు అంశాలకు సంబంధించి చిత్ర యూనిట్ ఇంకా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేయలేదు. కానీ, అభిమానుల్లో ఈ రెండు అప్డేట్స్ మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఇక ఈ సినిమాలో అఖిల్ స్టన్నింగ్ లుక్స్‌తో కనిపిస్తుండగా, అందాల భామ సాక్షి వైద్య ఈ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. హిప్‌హాప్ తమిళ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.