Agent Movie: రామకృష్ణా అంటూ బ్రేకప్ సాంగ్‌తో వస్తున్న ఏజెంట్
అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఏజెంట్’ను ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.

Break Up Song To Be Released From Agent Movie
Agent Movie: అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఏజెంట్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయగా, పూర్తి స్పై థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా రానుంది. ఈ సినిమాలో అఖిల్ సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇక బాడీ కూడా బిల్డ్ చేసిన అఖిల్, ఏజెంట్ మూవీతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.
Agent Movie: ప్రమోషన్స్ స్టార్ట్ చేసేందుకు డేట్ ఫిక్స్ చేసిన ‘ఏజెంట్’
సమ్మర్ కానుకగా ఈ సినిమాను ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ గ్రాండ్‌గా నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా నుండి మరో మేజర్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా నుండి మరో సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. రామకృష్ణా అనే బ్రేకప్ సాంగ్‌ను తీసుకొస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సాంగ్ యూత్‌ను బాగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.
Agent Movie: ఏజెంట్ సినిమాలో అది ఖచ్చితంగా ఉంటుందని చెప్పిన అఖిల్
ఇక ఈ సినిమాలో అందాల భామ సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ సినిమాకు హిప్‌హాప్ తమిళ సంగీతం అందిస్తున్నాడు. ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేయగా, పాన్ ఇండియా మూవీగా ఏజెంట్ సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు.