Agent Movie: ప్రమోషన్స్ స్టార్ట్ చేసేందుకు డేట్ ఫిక్స్ చేసిన ‘ఏజెంట్’
అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఏజెంట్’ను జనంలోకి తీసుకెళ్లేందుకు ఈ చిత్ర ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.

Agent Movie Promotions To Be Start From This Date
Agent Movie: అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఏజెంట్’పై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లోనూ సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. చాలా గ్యాప్ తరువాత అఖిల్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఖచ్చితంగా విజయాన్ని అందుకుంటుందని అభిమానులు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.
Agent Movie: ఏజెంట్ సినిమాలో అది ఖచ్చితంగా ఉంటుందని చెప్పిన అఖిల్
ఇక ఈ సినిమా నుండి ఇటీవల వరుస అప్డేట్స్ ఇస్తూ చిత్ర యూనిట్ సందడి చేస్తోంది. అఖిల్ బర్త్‌డే కానుకగా ఏజెంట్ మూవీకి సంబంధించిన కొత్త పోస్టర్స్‌ను రిలీజ్ చేసి అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యింది.
Agent Movie: ఏజెంట్ కోసం బరిలోకి దిగుతున్న ఆర్ఆర్ఆర్ వీరులు..?
ఏప్రిల్ 15 నుండి ఈ చిత్ర ప్రమోషన్స్‌ను మొదలుపెట్టేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. వరుస ఈవెంట్స్‌తో ఏజెంట్ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు పక్కా ప్లానింగ్‌తో రానున్నారు. ఇక ఈ సినిమా కోసం అఖిల్ కూడా ప్రమోషన్స్‌లో దూకుడు చూపించనున్నాడు. ఈ సినిమాలో మలయాళ స్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటిస్తుండగా, అందాల భామ సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తోంది. హిప్‌హాప్ తమిళ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు.