Agent Movie Wild Saala Song Makes Fans Go Crazy
Agent Movie: అక్కినేని యంగ్ హీరో అఖిల్ లేటెస్ట్ మూవీ ‘ఏజెంట్’ మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు అఖిల్ రెడీ అవుతున్నాడు. ఈ సినిమాపై అఖిల్ భారీ నమ్మకాలు పెట్టుకున్నాడు. దర్శకుడు సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో ఓ స్పై పాత్రలో అఖిల్ నటిస్తున్నాడు. దీంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
Agent Movie : సముద్రంలో ఏజెంట్ మూవీ స్పెషల్ ఇంటర్వ్యూ
కాగా, ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను ఇప్పటికే గ్రాండ్‌గా నిర్వహిస్తోంది చిత్ర యూనిట్. తాజాగా ఈ సినిమా నుండి ఓ సూపర్ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘వైల్డ్ సాలా’ అంటూ సాగే ఈ ఫాస్ట్ బీట్ సాంగ్‌లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా అదిరిపోయే స్టెప్పులు వేసింది. ఈ సాంగ్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండటంతో అభిమానులు ఈ పాటకు ఫిదా అవుతున్నారు. ఈ పాటకు థియేటర్స్‌లో డ్యాన్సులు చేయడం ఖాయమని వారు అంటున్నారు.
Agent Movie: సెన్సార్ పూర్తి చేసుకున్న ఏజెంట్.. రన్‌టైమ్ ఎంతంటే?
ఏజెంట్ మూవీలో అఖిల్ మేకోవర్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఈ సినిమాలో అందాల భామ సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు హిప్‌హాప్ తమిళ సంగీతం అందిస్తుండగా, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది.