Agent Movie: సెన్సార్ పూర్తి చేసుకున్న ఏజెంట్.. రన్‌టైమ్ ఎంతంటే?
అక్కినేని అఖిల్ లేటెస్ట్ మూవీ ‘ఏజెంట్’ రిలీజ్ కు రెడీ కావడంతో, ఈ సినిమా సెన్సార్ పనులు ముగించుకుంది.

Agent Movie Completes Censor And Locks Runtime
Agent Movie: అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అఖిల్ ఏజెంట్ మూవీ ఏప్రిల్ 28న రిలీజ్‌కు రెడీ అయ్యింది. దర్శకుడు సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ కంప్లీట్ స్పై థ్రిల్లర్ మూవీలో అఖిల్ సరికొత్త లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు.
Agent Movie: ప్రీరిలీజ్ ఈవెంట్‌కు డేట్ అండ్ ప్లేస్ ఫిక్స్ చేసిన ఏజెంట్!
ఇక ఈ సినిమా నుండి వరుస అప్డేట్స్ రిలీజ్ చేస్తూ చిత్ర యూనిట్ ఈ మూవీపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్ ఈ సినిమాపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ పనులను కూడా చిత్ర యూనిట్ ముగించుకుంది. ఏజెంట్ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. ఈ సినిమాలోని యాక్షన్ డోస్ ప్రేక్షకులను విజువల్ ట్రీట్ ఇవ్వడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.
Agent Trailer Launch Event : ఏజెంట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఫొటోలు..
కాగా, ఈ సినిమా రన్‌టైమ్‌ను 2 గంటల 36 నిమిషాలుగా లాక్ చేసింది చిత్ర యూనిట్. ఓ ఫక్తు కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీకి ఇది పర్ఫెక్ట్ రన్‌టైమ్ అని చెప్పాలి. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఈ సినిమాలో అఖిల్ చేసే యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను స్టన్ చేయడం ఖాయమని.. ఈ సినిమాలో అతడి పర్ఫార్మెన్స్ నెక్ట్స్ లెవెల్‌లో ఉంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాలో అందాల భామ సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తోంది.
?ltimate ?ction LOCKED?#AGENT is certified with ?/? & all LOADED to offer you all a WILD ACTION TREAT in cinemas from APRIL 28th ?#AGENTonApril28th ❤️?@AkhilAkkineni8 @mammukka @sakshivaidya99 @DirSurender @AnilSunkara1 @AKentsOfficial pic.twitter.com/sF9zI86O3I
— AK Entertainments (@AKentsOfficial) April 21, 2023