RGV: హైదరాబాద్‌లోని ఆర్జీవీ ఆఫీసు ముందు అలజడి.. వీడియో పోస్ట్ చేసిన వర్మ

పోలీసులకు వర్మ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు రాగానే వారు పారిపోయారని ఆర్జీవీ ట్వీట్లో పేర్కొన్నారు.

Ram Gopal Varma

Vyooham movie: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆఫీసు ముందు అలజడి చెలరేగింది. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసి వర్మ మండిపడ్డారు. రామ్ గోపాల్ వర్మ రూపొందించిన వ్యూహం సినిమా విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.

విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఇప్పటికే వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. ఇవాళ హైదరాబాద్‌లోని ఆర్జీవీ కార్యాలయం ముందు టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రామ్ గోపాల్ వర్మకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడే వర్మ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు.

వ్యూహం సినిమాలో పాత్రలను వర్మ చూపించిన తీరును నిరసిస్తూ, ఆ మూవీ రిలీజ్ చేయొద్దంటూ టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. చంద్రబాబు జోలికి రావద్దని హెచ్చరించారు. పోలీసులకు వర్మ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు రాగానే టీడీపీ కార్యకర్తలు పారిపోయారని ఆర్జీవీ ట్వీట్లో పేర్కొన్నారు.


RGV Vyooham: వ్యూహం ప్రీరిలీజ్ ఈవెంట్లో మంత్రులు రోజా, అంబటి, జోగి రమేశ్ ఏమన్నారో తెలుసా?