Site icon 10TV Telugu

AHA Dance Icon : ‘ఆహా’ డ్యాన్స్ ఐకాన్.. ఎపిసోడ్ ప్రోమో.. పూనకాలే..

AHA Dance Icon epiosde promo released

AHA Dance Icon epiosde promo released

AHA Dance Icon :  తెలుగులో ఆహా ఓటీటీ దూసుకుపోతుంది. వరుసగా కొత్త సినిమాలు, సిరీస్ లతో పాటు కొత్త కొత్త షోలు కూడా మొదలుపెడుతూ ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తుంది. ఇటీవల ‘తెలుగు ఇండియన్ ఐడల్’ సింగింగ్ రియాలిటీ షోని గ్రాండ్ గా సక్సెస్ చేసింది. ఇప్పుడు డ్యాన్స్ ఐకాన్ అంటూ సరికొత్త డ్యాన్స్ షోతో వచ్చింది ఆహా. ఇప్పటికే ఈ షో లాంచింగ్ ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. తాజాగా డ్యాన్స్ ఐకాన్ ఎపిసోడ్ ప్రోమోని విడుదల చేశారు ఆహా టీం.

ఈ డ్యాన్స్ ఐకాన్ షోలో శేఖర్ మాస్టర్ తో పాటు రమ్యకృష్ణ కూడా జడ్జిగా వ్యవహరిస్తోంది. గతంలో కొన్ని తమిళ్ షోలలో రమ్యకృష్ణ జడ్జిగా చేసింది. ఆహా డ్యాన్స్ ఐకాన్ లో రమ్యకృష్ణ జడ్జిగా రావడంతో తెలుగులో మొట్టమొదటిసారి ఒక షోలో కనువిందు చేయనుంది. ఇక ఈ షోకి ఓంకార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. శ్రీముఖి, మోనాల్ గజ్జర్, యశ్వంత్ మాస్టర్ టీం హెడ్స్ గా ఉన్నారు. బెస్ట్ డ్యాన్సర్లు ఈ షోకి వచ్చారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో చూస్తే పూనకాలు రావడం ఖాయం.

Adivi Sesh : మేజర్ సినిమాలో ఆ సన్నివేశాలని ఎడిటింగ్ లో తీసేశాం.. నిర్మాతకి క్షమాపణలు చెప్పిన అడివిశేష్..

తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో డ్యాన్సర్లు తమ డ్యాన్సులతో అదరగొట్టగా రమ్యకృష్ణ జడ్జిగా తనదైన మార్క్ ని చూపించినట్టు తెలుస్తుంది. ఇక శేఖర్ మాస్టర్ సూపర్..సూపర్ అంటూ ఫుల్ ఎనర్జీగా కనిపించారు. శ్రీముఖి కూడా పంచులతో హంగామా చేసింది. ఇక యాశ్వంత్ మాస్టర్ కంటెస్టెంట్స్ తో మాస్ డ్యాన్స్ వేసి అదరగొట్టేసాడు. శేఖర్ మాస్టర్ కూడా కంటెస్టెంట్స్ తో డ్యాన్స్ వేశారు. ప్రోమో మాత్రం అదిరిపోయింది. ఈ డ్యాన్స్ ఐకాన్ షో సూపర్ హిట్ ప్రోగ్రాంగా నిలుస్తుంది. డ్యాన్స్ ఐకాన్ లాంచింగ్ ఎపిసోడ్ సెప్టెంబర్ 11న ‘ఆహా’లో ప్రీమియర్ అయింది. సెప్టెంబర్ 17 నుండి ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ఇది ప్రసారం కానుంది.

Exit mobile version