Aha OTT : చిరంజీవ.. ఆహాలో మరో సరికొత్త సిరీస్..ఎప్పటి నుండి అంటే..

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో సరికొత్త టాలెంట్ ను పరిచయం చేస్తుంటుంది.

aha OTT unveils new Mythological Series Chiranjeeva

Aha OTT : ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో సరికొత్త టాలెంట్ ను పరిచయం చేస్తుంటుంది. సరికొత్త స్టోరీస్ తో సరికొత్త నటీ నటులను పరిచయం చేస్తుంటారు. ఇప్పటికే ఆహా ప్రముఖ ఓటీటీలో ఎన్నో అద్భుతమైన వెబ్ సిరీస్, సినిమాలు వచ్చాయి. అందులో భాగంగానే ఓ సరికొత్త సిరీస్ ప్రకటిందింది ఆహా. తాజాగా చిరంజీవ ఓటీటీ వెబ్ సిరీస్ గురించి ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఒక సరికొత్త పోస్టర్ రిలీజ్ చేసింది.

Also Read : Thangalaan OTT Streaming : సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తంగలాన్.. ఎక్కడ చూడొచ్చంటే..

చిరంజీవ టైటిల్ తో “యముడి తో ఆట” అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో, ఈ సిరీస్ జనవరి 2025లో స్ట్రీమింగ్ అవుతుందని ప్రకటించారు.అభినయ కృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ సిరీస్ అన్ని వయసుల ప్రేక్షకులను ఆకర్షించేలా, అద్భుతమైన కథనంతో ఉత్కంఠభరితంగా ఉంటుందని ఆ పోస్ట్ లో పేర్కొన్నారు. కాగా ఈ ఇంట్రెస్టింగ్ సిరీస్ ను ఎ. రాహుల్ యాదవ్, సుహాసిని రాహుల్ సంయుక్తంగా నిర్మించారు.


ఇక ఇందులో నటిస్తున్న నటీ నటులకి సంబందించిన పూర్తి వివరాలు త్వరలోనే వస్తాయన్నారు. మరిన్ని అప్డేట్స్ త్వరలోనే వస్తాయని తెలిపారు ఆహా టీమ్. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.