Thangalaan OTT Streaming : సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తంగలాన్.. ఎక్కడ చూడొచ్చంటే..

ఈ ఏడాది ఆగస్ట్ 15న థియేటర్లలో రిలీజై భారీ విజయం సాధించిన మూవీ తంగలాన్.

Thangalaan OTT Streaming : సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తంగలాన్.. ఎక్కడ చూడొచ్చంటే..

Vikram Thangalan movie streaming in OTT

Updated On : December 10, 2024 / 3:33 PM IST

Thangalaan OTT Streaming : ఈ ఏడాది ఆగస్ట్ 15న థియేటర్లలో రిలీజై భారీ విజయం సాధించిన మూవీ తంగలాన్. చియాన్ విక్రమ్ హీరోగా న‌టించిన ఈ సినిమా పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కింది. కాగా ఇందులో పార్వ‌తి తిరువోతు, మాళ‌వికా మోహ‌న్ హీరోయిన్లుగా నటించారు. 100 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.35 కోట్లకు కొనుగోలు చేశారు.

తంగ‌లాన్‌గా విక్ర‌మ్ లుక్‌, యాక్టింగ్‌కు మొదట విమర్శలు అందినప్పటికీ ఆ తర్వాత మంచి టాక్ దక్కింది. అయితే ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుందని తెలిసినప్పటికి ఎప్పుడు వస్తుందన్నది మాత్రం చెప్పలేదు. డిసెంబర్ నెలలో రాబోతుందని వార్తలు వచ్చాయి. కానీ అందులో ఎటువంటి నిజం లేదు. ఇక ఇప్పుడు ఊహించని విధంగా మంగళవారం డిసెంబర్ 10 ఉదయం నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

Also Read : Pushpa 2 Collections : పుష్ప 2 హిందీ కలెక్షన్స్ రప్పారప్పా.. ఐదు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే…

ఇక ఈ చిత్రం తమిళం, తెలుగు, కన్నడ, మలయాళంలో అందుబాటులో ఉంది. స్టూడియో గ్రీన్, నీలం ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంకి జివి ప్రకాష్ కుమార్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ సినిమా 19వ శతాబ్దం నేపథ్యంలో సాగుతుంది. బ్రిటీషర్ల పాలనలో ఉన్నప్పుడు వెనుకబడిన వర్గాల పై అణిచివేత, వారి జీవితం ఎలా ఉండేది అన్న నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది.