Aishwarya Rai-Abhishek Bachchan : ఒక్క ఫొటోతో విడాకులపై క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్ కపుల్..
గత కొంత కాలంగా ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ విడిపోతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

Aishwarya Rai and Abhishek Bachchan gave clarity on divorce with one photo
Aishwarya Rai-Abhishek Bachchan : గత కొంత కాలంగా ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ విడిపోతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పటి నుండో ఈ వార్తలు వస్తున్నప్పటికీ ఈ జంట మాత్రం స్పందించలేదు. కానీ తాజాగా ఈ వార్తలకి ఒక్క ఫొటోతో చెక్ పెట్టింది బాలీవుడ్ క్వీన్. అయితే విడాకుల పుకార్ల మధ్య ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ గురువారం రాత్రి ముంబైలోని సన్ఎన్ సాండ్ హోటల్‌లో జరిగిన ఒక వివాహ రిసెప్షన్‌లో కలిసి మెరిశారు.
ఇక ఈ ఈవెంట్ లో దిగిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ బాలీవుడ్ జంట గురువారం రాత్రి పార్టీలో అయేషా జుల్కా, అను రంజన్, ఇతరులతో కలిసి కనిపించారు. అలాగే ఐశ్వర్య తల్లి బృందా రాయ్ కూడా ఈ ఈవెంట్ కి హాజరయ్యారు. చిత్ర నిర్మాత అను రంజన్ షేర్ చేసిన ఫోటోలో ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, బృందా రాయ్ హై ప్రొఫైల్ పార్టీలో సెల్ఫీకి పోజులిచ్చారు.
Also Read : Naga Chaitanya – Sobhita : నాగచైతన్య – శోభిత పెళ్ళిలో బిందెలో ఉంగరం ఎవరు తీశారో తెలుసా? ఈ వీడియో చూడండి..
ఐశ్వర్య సంప్రదాయ బ్లాక్ డ్రెస్ లో అద్భుతంగా కనిపించగా, అభిషేక్ దానిని మ్యాచ్ చేస్తూ బ్లాక్ సూట్‌లో క్లాసీగా ఉన్నాడు. అయితే మొత్తానికి ఈ ఒక్క ఫొటోతో ఈ జంట విడాకులు తీసుకోలేదు కలిసే ఉన్నారన్న క్లారిటీ వచ్చింది.