Naga Chaitanya – Sobhita : నాగచైతన్య – శోభిత పెళ్ళిలో బిందెలో ఉంగరం ఎవరు తీశారో తెలుసా? ఈ వీడియో చూడండి..

ఇప్పటికే నాగచైతన్య - శోభిత పెళ్లి నుంచి అనేక ఫోటోలు, వీడియోలు బయటకు రాగా తాజాగా ఓ సరదా వీడియో బయటకువచ్చింది.

Naga Chaitanya – Sobhita : నాగచైతన్య – శోభిత పెళ్ళిలో బిందెలో ఉంగరం ఎవరు తీశారో తెలుసా? ఈ వీడియో చూడండి..

A Funny Video comes out from Naga Chaitanya Sobhita Wedding goes Viral

Updated On : December 6, 2024 / 12:11 PM IST

Naga Chaitanya – Sobhita : నాగచైతన్య – శోభిత పెళ్లి ఇటీవల డిసెంబర్ 4 రాత్రి అన్నపూర్ణ స్టూడిలో ఘనంగా జరిగింది. స్టూడియోలో ఏఎన్నార్ విగ్రహం ముందు పెళ్లి మండపం వేసి హిందూ సాంప్రదాయ పద్దతిలో పెళ్ళి జరిగింది. ఈ పెళ్ళికి ఇరు కుటుంబ సభ్యులతో పాటు కేవలం అతి తక్కువ మంది సినీ ప్రముఖులు, సన్నిహితులు వచ్చారు.

ఇప్పటికే నాగచైతన్య – శోభిత పెళ్లి నుంచి అనేక ఫోటోలు, వీడియోలు బయటకు రాగా తాజాగా ఓ సరదా వీడియో బయటకువచ్చింది. పెళ్లిలా పాలబిందెలో ఉంగరం వేసి దంపతులతో తీయించే ఘట్టం ఉంటుందని తెలిసిందే. పెళ్ళిలో ఈ ఘట్టం చాలా సరదాగా ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరూ ఉంగరం కోసం పోటీ పడతారు. ఇప్పుడు చైతు – శోభిత పెళ్లి నుంచి కూడా ఈ వీడియో బయటకు వచ్చింది.

Also Read : Ram Pothineni : రామ్ నెక్స్ట్ సినిమా నుంచి ఫస్ట్ లుక్ వచ్చేసింది.. మళ్ళీ చాక్లెట్ బాయ్ గా మారిన రామ్..

ఈ వీడియోలో పంతులు ఉంగరాన్ని పాలబిందెలో వేయగా నాగచైతన్య – శోభిత ఇద్దరూ ఉంగరం తీయడానికి పోటీపడ్డారు. ఈ ఘట్టం సరదాగా సాగింది. చివరకు నాగచైతన్య ఉంగరం తీశారు. చైతు – శోభిత పెళ్లిలో ఈ సరదా వీడియోని మీరు కూడా చూసేయండి..