Garuda 2.0 : ఐశ్వర్య రాజేష్ తమిళ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా.. ఇప్పుడు డబ్బింగ్ తో తెలుగు ఓటీటీలో

ఐశ్వర్య రాజేష్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఇప్పుడు తెలుగులో డబ్బింగ్ తో రిలీజయింది.

Aishwarya Rajesh Aarathu Sinam Dubbed in Telugu Streaming in Aha OTT

Garuda 2.0 : ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం తెలుగు, తమిళ్ లో మంచి ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఆమెకు వచ్చిన ఫేమ్ తో తమిళ్ లో ఐశ్వర్య రాజేష్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఇప్పుడు తెలుగులో డబ్బింగ్ తో రిలీజయింది. అరివాజగన్ వెంకటాచలం దర్శకత్వంలో డిమోంటి కాలనీ హీరో అరుళ్ నీతి తమిళరాజు, ఐశ్వర్య రాజేష్, ఐశ్వర్య దత్త మెయిన్ లీడ్స్ లో తెరకెక్కి బ్లాక్ బస్టర్ గా నిలిచిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఆరత్తు సీనం.

Also Read : Rithu Chowdary : బిగ్ బాస్ ఎంట్రీ పై రీతూ చౌదరి కామెంట్స్.. వెళ్తారా అని అడిగితే..

ఈ సినిమాని తెలుగులో డబ్బింగ్ చేసి గరుడ 2.0 పేరుతో ఆహా ఓటీటీలో రిలీజ్ చేసారు. హనుమాన్ మీడియా బ్యానర్ పై పలు సూపర్ హిట్ తమిళ సినిమాలు తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేసిన నిర్మాత బాలు చరణ్ ఇప్పుడు ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఆరత్తు సీనంను తెలుగులో గరుడ 2.0 గా రిలీజ్ చేసారు.

ప్రస్తుతం ఆహా ఓటీటీలో ఈ గరుడ 2.0 సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.