×
Ad

Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’.. ఘట్టమనేని వారసుడి కొత్త సినిమా.. పోస్టర్ అదిరింది..

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కొత్త తరం హీరో రాబోతున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్నాడు.

Ajay bhupathi 'Srinivasa Mangapuram' movie title poster released

Srinivasa Mangapuram: ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కొత్త తరం హీరో రాబోతున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్నాడు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వచ్చేసింది. ఈ క్రేజీ ప్రాజెక్టుకు RX 100, మంగళవారం లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన కల్ట్ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించనున్నాడు. ఇప్పటికే షూటింగ్ కూడా మొదలయ్యింది. బాలీవుడ్ బ్యూటీ రాష టడని హీరోయిన్ గా నటిస్తోంది.

Manchu Lakshmi: నా కుటుంబం ఎప్పటిలా కలిసిపోవాలి.. నాకున్న ఏకైక కోరిక అదే.. ఆ దేవుడు వరం ఇస్తే..

తాజాగా ఈ సినిమా టైటిల్ రివీల్ చేస్తూ ఒక పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమాకు “శ్రీనివాస మంగాపురం(Srinivasa Mangapuram)” అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. పోస్టర్ లో హీరో హీరోయిన్ చేతులు పట్టుకొని చేతిలో గన్ ఉన్నట్టుగా చూపించారు. ఈ పోస్టర్ చూస్తుంటే మరోసారి రా అండ్ రస్టిక్ కథాంశంతో రానున్నాడు అజయ్ భూపతి అను క్లియర్ గా అర్థమవుతోంది. తిరుపతి పక్కన ఉండే శ్రీనివాస్ మంగాపురం అనే ఊరిలో జరిగే కథతో ఈ సినిమా రానుందని టాక్ నడుస్తోంది. ఇక ఈ సినిమాను చంద‌మామ క‌థ‌లు బ్యాన‌ర్‌పై పి. కిర‌ణ్ నిర్మిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత ఆశ్వ‌నీద‌త్ సమర్పకుడిగా ఉన్నారు. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.