Raid Movie : ఇక్కడ రవితేజ సినిమా తీస్తుంటే.. దానికి సీక్వెల్ తీసేస్తున్న అజయ్ దేవగణ్

అజయ్ దేవగణ్ రైడ్ సినిమాని ఇప్పుడు హరీష్ శంకర్ 'మిస్టర్ బచ్చన్'(Mr Bachchan) అనే పేరుతో రవితేజ(Raviteja) హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

Ajay Devgn announced Sequel for Raid Movie which Remaking by Raviteja as Mr Bachchan

Raid Movie : 2018లో రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వంలో అజయ్ దేవగణ్(Ajay Devgn) హీరోగా 1980ల్లో జరిగిన ఓ నిజ సంఘటన ఆధారంగా ‘రైడ్’ సినిమా తెరకెక్కింది. బాలీవుడ్(Bollywood) లో రైడ్ సినిమా మంచి విజయం సాధించింది. ఓ రాజకీయ నాయకుడి ఇంట్లో ఇన్‌కం ట్యాక్స్ ఆఫీసర్ రైడ్ కి వస్తే అక్కడ జరిగిన పరిణామాలు ఏంటి, అతన్ని ఆ రాజకీయ నాయకుడు ఎలా ఇబ్బంది పెట్టాడు, అతని ఫ్యామిలీ.. కథాంశంతో రైడ్ సినిమాని ఆసక్తిగా తెరకెక్కించారు.

అజయ్ దేవగణ్ రైడ్ సినిమాని ఇప్పుడు హరీష్ శంకర్ ‘మిస్టర్ బచ్చన్'(Mr Bachchan) అనే పేరుతో రవితేజ(Raviteja) హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. అయితే ఓ పక్క రవితేజ రైడ్ రీమేక్ చేస్తుంటే తాజాగా అజయ్ దేవగణ్ రైడ్ సినిమాకు సీక్వెల్ ప్రకటించాడు. నేడు రైడ్ 2 టైటిల్ తోనే పోస్టర్ కూడా రిలీజ్ చేసి పూజ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ సినిమాని కూడా రాజ్ కుమార్ గుప్తా తెరెక్కిస్తున్నారు.

Also Read : Brahmanandam : ‘బ్రహ్మానందం’ది ఇంటర్‌క్యాస్ట్ మ్యారేజ్ అని తెలుసా..? ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే బ్రహ్మి ఏం చేశారంటే?

అయితే మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే రైడ్ 2 సినిమా ఓపెనింగ్ పూజ కార్యక్రమాలకు హరీష్ శంకర్, రవితేజ వెళ్లడం. నేడు ఉదయం ఈ ఇద్దరూ స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్ నుంచి ముంబై బయలుదేరారు రైడ్ 2 పూజా కార్యక్రమంలో పాల్గొనటానికి. ఇక రైడ్ 2 సినిమాని 2024 నవంబర్ 15 రిలీజ్ చేస్తామని కూడా ప్రకటించేశారు. ఆ లోపు రవితేజ మిస్టర్ బచ్చన్ వస్తుందా రాదా చూడాలి. మరి రవితేజ రైడ్ 2ని కూడా రీమేక్ చేస్తాడా? లేదా రైడ్ 2 నేషనల్ వైడ్ రిలీజ్ అవుతుందా ఒకవేళ రైడ్ 2 సినిమా మిస్టర్ బచ్చన్ కంటే ముందే పాన్ ఇండియా రిలీజ్ అయితే రవితేజకు ఎఫెక్ట్ అవుతుందా?.. ఇవన్నీ తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఎదురు చూడాల్సిందే.