×
Ad

Ajith Kumar : ఆ దేశంలో అజిత్ కార్ రేసింగ్.. ఫొటోస్ చూసారా..

తాజాగా మరో రేసింగ్ ఫోటోలు షేర్ చేశారు అజిత్.

  • Published On : November 28, 2024 / 12:18 PM IST

Ajith Kumar car racing in that country photos goes viral

Ajith Kumar : తమిళ స్టార్ అజిత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో నటించి భారీ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న ఈయనకి తెలుగులో సైతం భారీ గుర్తింపు ఉంది. ఈ వయసులో కూడా కుర్ర హీరోలకి పోటీగా సినిమాలు చేస్తూ యాక్షన్ సీన్స్ దుమ్ములేపుతారు. అయితే ఒకవైపు సినిమాలు చేస్తూనే మరో వైపు రేసింగ్ కూడా చేస్తుంటారు ఈయన.

Also Read : Naveen Chandra : వామ్మో అస్థిపంజరంతో నవీన్ చంద్ర ఆటలు.. వీడియో చూసారా..

బైక్, కార్ రేసింగ్ అజిత్ కు చాలా ఇష్టం. ఈ రేసింగ్ లల్లో ఆయన పలుమార్లు ప్రమాదానికి కూడా గురయ్యాడు. కార్ రేసింగ్ పై అతడికున్న ఇష్టంతో ప్రస్తుతం దానిపైనే ఫోకస్ చేస్తూ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. అయితే తాజాగా మరో రేసింగ్ ఫోటోలు షేర్ చేశారు అజిత్. స్పెయిన్ లోని బార్సిలోనాలో రేసింగ్ చేసారు. అజిత్ కుమార్ స్పెయిన్ లోని బార్సిలోనా ఎఫ్ 1 సర్క్యూట్ పై ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.


ఇకపోతే అజిత్ కుమార్ 2010 లో స్పోర్ట్స్ కార్ రేసర్ గా తన ప్రయాణాన్ని స్టార్ట్ చేశారు. ఇప్పటికే ముంబై, చెన్నై, ఢిల్లీ, అంతర్జాతీయంగా జర్మనీ, మలేషియాలో వివిధ రౌండ్లలో పాల్గొన్నారు. అర్మాన్ ఇబ్రహీం, పార్థివ సూరేశ్వరన్ లతో కలిసి ఫార్ములా 2 ఛాంపియన్ షిప్ రేసులో పాల్గొన్నాడు అజిత్. దీంతో ఆయన షేర్ చేసిన ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.