Naveen Chandra : వామ్మో అస్థిపంజరంతో నవీన్ చంద్ర ఆటలు.. వీడియో చూసారా..
నవీన్ చంద్ర. ఒక అడవిలో అస్థిపంజరం ( స్కెలిటన్ ) తో ఆటలాడుతున్న వీడియో షేర్ చేసి భయపెట్టాడు.

Naveen Chandra plays with skeleton video goes viral
Naveen Chandra : టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు నవీన్ చంద్ర గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కేవలం సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ కూడా చేసి ఆడియన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో కియారా హీరోయిన్ గా నటిస్తుంది.
Also Read : Allu Arjun : కేరళ పుష్ప ఈవెంట్ కి రాని భన్వర్ సింగ్ షకావత్.. ఫహద్ పై బన్నీ కామెంట్స్..
అయితే నవీన్ చంద్ర సినిమాలతో బిజీగా ఉనప్పటికీ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు. తన సినిమాలకి సంబందించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంటాడు. తాజాగా ఓ వెరైటీ వీడియో షేర్ చేసాడు నవీన్ చంద్ర. ఒక అడవిలో అస్థిపంజరం ( స్కెలిటన్ ) తో ఆటలాడుతున్న వీడియో షేర్ చేసి భయపెట్టాడు. ఆ అస్థిపంజరంతో హాయ్, హలో అంటూ మాట్లాడుతూ వీడియో షేర్ చేసాడు. దీంతో ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
View this post on Instagram
ఇన్స్పెక్టర్ రిషి సిరీస్ షూటింగ్ సమయంలో ఈ వీడియో షూట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇదొక హార్రర్ థ్రిల్లర్ సిరీస్. ఈ సిరీస్ కోసమే ఆ అస్థిపంజరాన్ని వాడారు. దానితో ఈ వీడియో చేసి పోస్ట్ చేసారు నవీన్ చంద్ర.