Allu Arjun : కేరళ పుష్ప ఈవెంట్ కి రాని భన్వర్ సింగ్ షకావత్.. ఫహద్ పై బన్నీ కామెంట్స్..

పుష్ప 2 సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న ఫహాద్ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ప్రమోషన్స్ కి రాలేదు.

Allu Arjun : కేరళ పుష్ప ఈవెంట్ కి రాని భన్వర్ సింగ్ షకావత్.. ఫహద్ పై బన్నీ కామెంట్స్..

Allu Arjun addressed Fahadh Faasil absence from Pushpa 2 promotions

Updated On : November 28, 2024 / 11:05 AM IST

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన లేటెస్ట్ సినిమా పుష్ప 2. డిసెంబర్ 5న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడానికి రెడీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన ప్రమోషన్స్ ను పాన్ ఇండియా లెవెల్ లో చెయ్యడం కూడా స్టార్ట్ చేసారు మేకర్స్. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

అయితే తాజాగా ఈ సినిమాకి సంబందించిన ఓ ప్రమోషనల్ ఈవెంట్ ను కేరళ కొచ్చిలో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి బన్నీ, రష్మిక మందన్న ఇద్దరూ వచ్చారు. కానీ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న ఫహాద్ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ప్రమోషన్స్ కి రాలేదు. ఇక ఈ ఈవెంట్ లో ఫహాద్ లేకపోవడం గురించి ఫీల్ అవుతూ.. ” ఫహాద్ కి చాలా థాంక్స్, పుష్ప 2లో ఫాఫా యాక్టింగ్ అద్భుతంగా ఉంటుంది. పుష్ప 2లో తన నటనతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క మలయాళీ ఆడియాన్ ను గర్వపడేలా చేస్తాడని తెలిపారు బన్నీ.

Also Read : Mallika Sherawat : అరెరె.. ప్రియుడితో విడిపోయిందా.. ఒంటిరిగానే ఉంటున్న హాట్ భామ మల్లికా షెరావ‌త్‌

అంతేకాకుండా… నేను ఇప్పటివరకు ఇన్ని సినిమాలు చేసినా, మొదటిసారి ఒక ఉత్తమ మలయాళ నటులలో ఒకరైన మా ఫాఫాతో కలిసి పనిచేశాను. నిజానికి ఈరోజు ఆయన ఈ ఈవెంట్ లో లేకపోవడం బాధగా ఉంది. మేమిద్దరం కలిసి కేరళలో స్టేజ్ షేర్ చేసుకుని.. దాన్ని ఐకానిక్ మూమెంట్ గా మార్చాలని కోరుకుంటున్నా” అని తెలిపారు అల్లు అర్జున్.