Mallika Sherawat : అరెరె.. ప్రియుడితో విడిపోయిందా.. ఒంటిరిగానే ఉంటున్న హాట్ భామ మల్లికా షెరావత్
నటి మల్లికా షెరావత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Mallika Sherawat confirms breakup With Cyrille Auxenfans
Mallika Sherawat : నటి మల్లికా షెరావత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మర్డర్ చిత్రంతో ఈ భామ యువత హృదయాలను చెదరగొట్టింది. తన హాట్ నెస్‌తో మతి పొగొట్టింది. గ్లామర్ పాత్రలతో మెప్పించే ఈ భామ నటుడు ఇమ్రాన్ హష్మీతో నటించిన బోల్డ్ సన్నివేశాలు అప్పట్లో చర్చనీయాంశం అయ్యాయి కూడా. ఈ భామ ఎక్కువగా ఐటెం సాంగ్స్‌తో ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ.. తాను ప్రస్తుతం ఒంటరిగా ఉన్నట్లు చెప్పింది.
తన ఫ్రెంచ్ ప్రియుడు సిరిల్ ఆక్సెన్‌ఫాన్స్‌తో బ్రేకప్ అయినట్లు తెలిపింది. అవును ఇది నిజం. సిరిల్ ఆక్సెన్‌ఫాన్స్‌తో బ్రేకప్ అయింది. మేమిద్దరం చాలా కాలం పాటు కలిసి ఉన్నాం. అయితే.. ఇప్పుడు కాదు. ఈ రోజుల్లో సరైన వ్యక్తిని కనుగొడం చాలా కష్టం. ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్నాను. అని మల్లికా అంది.
Pushpa 2 : అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సెన్సార్ పూర్తి.. రన్‌టైమ్ ఎంతంటే?
ఇక ప్రియుడితో విడిపోవడానికి గల కారణాలు అయితే చెప్పలేదు. పెళ్లి గురించి మాట్లాడుతూ.. దానిపై తనకు ఆసక్తి లేదంది. అలా అని తాను పెళ్లికి వ్యతిరేకం కాదంది. భవిష్యత్తులో తనకు కనెక్ట్ అయ్యే వ్యక్తి పై ఇది ఆధారపడి ఉంటుందని అంది. మర్డర్, డర్టీ పాలిటిక్స్, దశావతారం వంటి సినిమాల్లో మల్లికా నటించింది.