Allu Arjun : పుష్ప 2 నుంచి ఒక సీక్రెట్ రివీల్ చేసిన అల్లు అర్జున్.. కేరళ ఈవెంట్ స్పీచ్ బన్నీ ఏమన్నాడంటే..

కేరళ ఈవెంట్లో అల్లు అర్జున్ మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయం తెలిపారు.

Allu Arjun : పుష్ప 2 నుంచి ఒక సీక్రెట్ రివీల్ చేసిన అల్లు అర్జున్.. కేరళ ఈవెంట్ స్పీచ్ బన్నీ ఏమన్నాడంటే..

Allu Arjun Reveals a Pushpa 2 Secret in Kerala Event Details Here

Updated On : November 27, 2024 / 10:17 PM IST

Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 ఈవెంట్ నేడు కేరళ కొచ్చిలో ఘనంగా జరిగింది. కేరళలో కూడా అల్లు అర్జున్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. దీంతో నేడు ఈవెంట్ కు భారీగానే జనాలు వచ్చారు. ఇక ఈ ఈవెంట్లో అల్లు అర్జున్ మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయం తెలిపారు.

Also Read : Imanvi : ప్రభాస్ హీరోయిన్ కి కండిషన్స్..? అప్పటిదాకా నో ఛాన్స్..

అల్లు అర్జున్ మాట్లాడుతూ.. కేరళ ఫ్యాన్స్ నాకు చాలా స్పెషల్. కేరళ ఫ్యాన్స్ కి నా లవ్ ఎలా చూపించాలి అని ఆలోచించేవాడిని. ఒకరోజు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ని పిలిచి అడిగితే మలయాళంలో ఒక సాంగ్ చేద్దాం అన్నాడు. అందుకే పుష్ప 2 సినిమాలో ఒక సాంగ్ మొదట్లో మలయాళం లిరిక్స్ ఉంటాయి. అన్ని భాషల్లోనూ ఆ పాటలో లిరిక్స్ మళయాళంలోనే ఉంటాయి అని తెలిపాడు.

అలాగే ఆ పాట ప్రోమోని కూడా అక్కడ ప్లే చేసారు. త్వరలోనే ఆ పాటని రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఇక అన్ని భాషల్లో మలయాళం భాషలో లిరిక్స్ పెట్టడంపై అల్లు అర్జున్ స్పీచ్ తో కేరళ ఫ్యాన్స్ ఫిదా అయి బన్నీని అభినందిస్తున్నారు. ఆ సాంగ్ ప్రోమో మీరు కూడా వినేయండి..