Pushpa 2 : అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సెన్సార్‌ పూర్తి.. రన్‌టైమ్‌ ఎంతంటే?

సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న మూవీ పుష్ప 2.

Pushpa 2 : అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సెన్సార్‌ పూర్తి.. రన్‌టైమ్‌ ఎంతంటే?

Pushpa 2 The Rule Censor Completed Runtime Revealed

Updated On : November 28, 2024 / 8:57 AM IST

సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న మూవీ పుష్ప 2. పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా వ‌స్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. డిసెంబ‌ర్ 5న ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ, మ‌ల‌యాళ బాష‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది.

ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ బోర్డు స‌భ్యులు యూ/ఏ స‌ర్టిఫికెట్ జారీ చేశారు.ఇక చిత్ర నిడివి 3 గంట‌ల 18 నిమిషాలు ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలోని జాతర ఎపిసోడ్ దాదాపు 25 నిముషాలు ఉంటుందట. ఈ సీన్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని టాక్.

Roti Kapda Romance : ‘రోటి కపడా రొమాన్స్‌’ మూవీ రివ్యూ.. మీ లవర్స్ తో ఈ సినిమాకు వెళ్ళండి..

ఇక బుధ‌వారం నిర్వ‌హించిన ప్రెస్‌మీట్‌లో ఈ చిత్ర నిడివి గురించి నిర్మాత న‌వీన్ యెర్నేని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. నిడివి ఎంత ఉన్నా ఇబ్బంది ఏం లేద‌న్నారు. సినిమా చూశాక అస‌లు దాని గురించే మాట్లాడుకోర‌ని చెప్పారు.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సునీల్, ఫాహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, పాట‌లు, ట్రైల‌ర్‌కు విశేష స్పంద‌న వ‌చ్చింది. ట్రైల‌ర్‌కి 150 మిలియ‌న్‌కి పైగా వ్యూస్‌, 3 మిలియ‌న్‌కి పైగా లైక్స్ వ‌చ్చాయి. విడుద‌లైన 15 గంట‌ల్లోనే 40 మిలియ‌న్ల వ్యూస్ పొందిన తొలి ద‌క్షిణాది మూవీ ట్రైల‌ర్‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే.

Allu Arjun : పుష్ప 2 నుంచి ఒక సీక్రెట్ రివీల్ చేసిన అల్లు అర్జున్.. కేరళ ఈవెంట్ స్పీచ్ బన్నీ ఏమన్నాడంటే..