Roti Kapda Romance : ‘రోటి కపడా రొమాన్స్‌’ మూవీ రివ్యూ.. మీ లవర్స్ తో ఈ సినిమాకు వెళ్ళండి..

యూత్ తమ లవర్స్, ఫ్రెండ్స్ తో వెళ్లి ఈ మూవీని ఎంజాయ్ చేయొచ్చు.

Roti Kapda Romance : ‘రోటి కపడా రొమాన్స్‌’ మూవీ రివ్యూ.. మీ లవర్స్ తో ఈ సినిమాకు వెళ్ళండి..

Youthful Romantic Comedy Entertainer Roti Kapda Romance Movie Review and Rating

Updated On : November 28, 2024 / 7:50 AM IST

Roti Kapda Romance Movie Review : హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి.. హీరోహీరోయిన్స్ గా నాలుగు జంటలుగా తెరకెక్కిన సినిమా ‘రోటి కపడా రొమాన్స్‌’. లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కెం వేణుగోపాల్, సృజన కుమార్ బొజ్జం నిర్మాణంలో విక్రమ్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. యూత్ ఫుల్ లవ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన రోటి కపడా రొమాన్స్ సినిమా పలుమార్లు వాయిదా పడి నేడు నవంబర్ 28న రిలీజ్ అయింది. ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్స్ కూడా వేశారు.

కథ విషయానికొస్తే.. చాలా రోజుల తర్వాత ఓ నలుగురు ఫ్రెండ్స్ కలిసి తాము దూరమవడానికి కారణమైన ప్రేమ కథలను గుర్తుచేసుకుంటారు. రాహుల్, హర్ష, విక్కీ, సూర్య మంచి స్నేహితులు. హైదరాబాద్ లో ఒకే రూమ్ లో ఉంటారు. ఈవెంట్స్ చేసుకునే హర్ష(హర్ష నర్రా)కు ఓ రోజు సోనియాతో పరిచయం ఏర్పడుతుంది. సోనియా(కుష్బూ చౌదరి) కు హర్ష నచ్చి ఆమెలో హార్మోన్స్ సెట్ అవ్వాలని అతనితో సెక్స్ కావాలనుకుంటుంది. ఇందుకు హర్ష కూడా ఒప్పుకుంటాడు. ఆఫీస్ లో వర్క్ తో, బాస్ తో నలిగిపోతున్న రాహుల్(సందీప్ సరోజ్)కి తన టీమ్ కి కొత్త లీడర్ ప్రియా(సోను ఠాకూర్) వస్తుంది. రాహుల్ సోనుని ఇష్టపడతాడు. సోను కూడా తనంటే ఇంట్రెస్ట్ ఉందని చూపిస్తుంది. ఆర్జేగా పనిచేసే సూర్య(తరుణ్) కి అభిమాని అని ఓ రోజు దివ్య(నువేక్ష)పరిచయం అవుతుంది. దివ్య సూర్యని ప్రేమిస్తున్నాను అని అతనికి దగ్గరవుతుంది. ఇక ఖాళీగా తిరిగే విక్కీ(సుప్రజ్)కి తన ఇంటి దగ్గర శ్వేతా(మేఘాలేఖ) పరిచయమయి జాబ్ ఇప్పించమని అడుగుతుంది.

ఇలా ఈ నాలుగు జంటలు ప్రేమలో పడి సాగుతుండగా సోనియాకు ప్రగ్నెన్సీ వస్తుంది. సోను రాహుల్ ని పెళ్లి చేసుకొమ్మని అడుగుతుంది. దివ్య వేరే అబ్బాయిలతో తిరగడంతో సూర్య ప్రశ్నిస్తే బ్రేకప్ చెప్తుంది. ఇక శ్వేతాకు జాబ్ రాగానే విక్కీని పట్టించుకోవడం మానేస్తుంది. ఇలా నలుగురు అమ్మాయిలు ఈ నలుగురు అబ్బాయిలకు దూరం అవుతారు. అసలు వీళ్ళు ఎందుకు దూరమవుతారు? ఆ తర్వాత అబ్బాయిలు ఏం చేసారు? మళ్ళీ చాన్నాళ్ల తర్వాత ఆ అబ్బాయిలు ఎందుకు కలిశారు? మళ్ళీ ఆ నలుగురు అమ్మాయిల దగ్గరికి అబ్బాయిలు వెళ్తే వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారు తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Vikkatakavi : ‘వికటకవి’ వెబ్ సిరీస్ రివ్యూ.. తెలంగాణ బ్యాక్ డ్రాప్ సస్పెన్స్ థ్రిల్లర్..

సినిమా విశ్లేషణ.. యూత్ లో ఫ్రెండ్స్ – వాళ్ళ లవ్ స్టోరీలతో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఇదే నిర్మాణ సంస్థ నుంచి హుషారు అనే మూవీ కూడా వచ్చింది. ఈ కథ కూడా ఆల్మోస్ట్ అంతే. ఓ నలుగురు అబ్బాయిల జీవితాల్లోకి ప్రేమ పేరుతో అమ్మాయిలు వస్తే వాళ్ళ జీవితాలు ఏమయ్యాయి అని రొమాంటిక్ కామెడీగా చూపించారు. ఫస్ట్ హాఫ్ అంతా అన్ని పాత్రలను పరిచయం చేయడం, వారి మధ్య ఘాటు రొమాన్స్, కొంచెం కామెడీతో మొదటి పావుగంట తప్ప ఆ తర్వాత ఎక్కడా బోర్ కొట్టకుండా సాగుతుంది. ఇంటర్వెల్ కి వీళ్ళకు బ్రేకప్స్ అవుతాయా అనే ఓ ప్రశ్నతో వదిలేసి సెకండ్ హాఫ్ లో ఈ ప్రేమ జంటల మధ్య ఏం జరిగింది? ఎందుకు దూరమయ్యారు? మళ్ళీ కలిస్తే ఏం జరిగింది అని చూపించారు.

ప్రీ క్లైమాక్స్ నుంచి కాస్త ఎమోషనల్ టచ్ ఇచ్చారు. ఇక క్లైమాక్స్ చూస్తే ఈ నగరానికి ఏమైంది సినిమాలోని సీన్స్ గుర్తుకు రావడం ఖాయం. అయితే మొదట్నుంచి అమ్మాయిల పాత్రలు నెగిటివ్ షేడ్స్ లో చూపించి చివర్లో మాత్రం వాళ్ళకు ఉండే కారణాలు చూపించి అబ్బాయిలు రియలైజ్ అవ్వడం కథకు కంప్లీట్ డిఫరెంట్ గా ఉందనిపిస్తుంది. సినిమా మాత్రం ఆల్మోస్ట్ ఎక్కడా బోర్ కొట్టకుండా అక్కడక్కడా నవ్విస్తూ కొంచెం రొమాన్స్ ఎక్కువే చూపిస్తూ యూత్ ని మాత్రం అట్రాక్ట్ చేస్తుంది. ఈ సినిమాకు ఫ్యామీలలతో కంటే లవర్స్ తో, ఫ్రెండ్స్ తో వెళ్లడం బెటర్.

Image

నటీనటుల పర్ఫార్మెన్స్.. హర్ష, సందీప్ సూరజ్ కాస్త అమాయక పాత్రల్లో మెప్పిస్తారు. తరుణ్ ఆర్జేగా స్టైలిష్ గా మెప్పించాడు. సుప్రజ్ మాత్రం బాగానే నవ్వించాడు. ఇక హీరోయిన్స్ లో కుష్బూ చౌదరి, నువేక్ష తమ అందాలతో రెచ్చిపోయి రొమాన్స్ సీన్స్ లో కూడా బాగానే నటించారు. సోను ఠాకూర్ పాత్ర సింపుల్ గా ఉంటుంది. మేఘలేఖ మాత్రం క్యూట్ గా పక్కింటి అమ్మాయిలా అలరించింది. సినిమా అంతా ముఖ్యంగా ఈ నాలుగు జంటల మధ్యే నడుస్తుంది. మిగిలిన పాత్రలు కూడా పర్వాలేదనిపిస్తాయి.

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది. పాటలు బాగున్నాయి. కొత్తగా కథ ఏం లేకపోయినా కథనంతో ఎక్కడా బోర్ కొట్టకుండా బాగానే నడిపించారు. క్లైమాక్స్ ఇంకొంచెం బెటర్ గా రాసుకుంటే బాగుండు అనిపిస్తుంది. డైరెక్టర్ కి మొదటి సినిమా అయినా పర్ఫెక్ట్ అవుట్ పుట్ ఇవ్వడంలో నూరు శాతం సక్సెస్ అయ్యాడు. ఇక నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.

మొత్తంగా ‘రోటి కపడా రొమాన్స్’ సినిమా రొమాంటిక్ కామెడీగా యూత్ ని మెప్పిస్తుంది. యూత్ తమ లవర్స్, ఫ్రెండ్స్ తో వెళ్లి ఈ మూవీని ఎంజాయ్ చేయొచ్చు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.