Ajith Kumar Trisha Good Bad Ugly Teaser Released
Good Bad Ugly : తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఇటీవలే పట్టుదల సినిమాతో వచ్చి పర్వాలేదనిపించారు. ఇప్పుడు గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో రాబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్, త్రిష జంటగా ఈ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా తెరకెక్కుతుంది.
Also Read : Rambha : అప్పట్లో కుర్రాళ్ళ కలల రాణి.. ‘రంభ’.. మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ
సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా పలు కారణాలతో వాయిదా పడింది. నిన్న తమిళ్ టీజర్ రిలీజ్ చేయగా తాజాగా గుడ్ బ్యాడ్ అగ్లీ తెలుగు, హిందీ టీజర్ రిలీజ్ చేసారు. ఈ టీజర్ చూస్తుంటే అజిత్ మళ్ళీ ఇంకో యాక్షన్ సినిమాతో రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇందులో ఫ్లాష్ బ్యాక్ లో వింటేజ్ అజిత్ లుక్స్ కనపడనున్నాయి. మీరు కూడా గుడ్ బ్యాడ్ అగ్లీ టీజర్ చూసేయండి..
ఇక ఈ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా ఏప్రిల్ 10న తెలుగు, తమిళ్, హిందీలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.