Rambha : అప్పట్లో కుర్రాళ్ళ కలల రాణి.. ‘రంభ’.. మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ
ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ వరుసగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ క్రమంలో రంభ కూడా రీ ఎంట్రీ ఇస్తుందట.

90S Star Heroine Rambha Ready to Re Entry in Movies
Rambha : 90వ దశకంలో స్టార్ హీరోయిన్స్ గా ఎదిగిన వారిలో రంభ ఒకరు. ఆల్మోస్ట్ ఓ పదేళ్ల పాటు రంభ తెలుగు, తమిళ్ సినిమాలను ఏలింది. అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేసి బోలెడన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టింది. తెలుగులో 1992లో ఆ ఒక్కటి అడక్కు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రంభ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ఇలా స్టార్ హీరోలందరితో చేసింది.
అప్పట్లోనే రంభ హీరోయిన్ గా చేస్తూ స్పెషల్ సాంగ్స్ లో మెరిపించి అప్పటి హీరోయిన్స్ కూడా షాక్ అయ్యేలా చేసింది. హీరోలతో సమానంగా రంభ అదిరిపోయే డ్యాన్స్ వేసేది. సినిమాలు మానేసే ముందు కూడా అల్లు అర్జున్ తో దేశముదురు సినిమాలో, ఎన్టీఆర్ యమదొంగ సినిమాలో అదిరిపోయే స్టెప్పులతో మెప్పించింది. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ.. ఇలా అన్ని భాషల్లో సినిమాలతో అలరించింది. శర్వానంద్ మహాసముద్రం సినిమాలో రంభ మీద ఏకంగా ఒక పాటే రాసారంటే అప్పట్లో రంభ ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ , క్రేజ్ తెచ్చుకుందో తెలుస్తుంది.
Also Read : Aadi Pinishetty : ‘రంగస్థలం’ లో రోహిణి గారు, సమంత ఏడుపు విని.. నేను చాలా భయపడ్డా.. అది చూసి మా నాన్న..
అయితే ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ వరుసగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ క్రమంలో రంభ కూడా రీ ఎంట్రీ ఇస్తుందట. 2010 లో రంభ ఓ వ్యాపారవేత్తని పెళ్లి చేసుకొని టొరంటోకి వెళ్ళిపోయింది. కొన్నేళ్ల క్రితమే రంభ తన ఫ్యామిలీతో ఇండియాకు వచ్చి చెన్నైలో సెటిల్ అయింది. ఆల్రెడీ టీవీ షోలలోకి ఎంట్రీ ఇచ్చింది రంభ. ఇప్పుడు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుంది.
Also Read : DJ Tillu – Mad : డీజే టిల్లు – మ్యాడ్ యూనివర్స్ లను కలుపుతున్న డైరెక్టర్..? టిల్లు క్యూబ్ లో మ్యాడ్ బాయ్స్..
తాజాగా రంభ తన రీ ఎంట్రీ గురించి మీడియాతో మాట్లాడుతూ.. నా ఫస్ట్ ఛాయిస్ ఎప్పుడూ సినిమానే. ఇప్పుడు ఎలాంటి ఛాలెంజింగ్ రోల్స్ అయినా చేయడానికి నేను రెడీ. నేను రీ ఎంట్రీ ఇవ్వడానికి ఇది సరైన సమయం అని ఫీల్ అవుతున్నాను. కొత్త పాత్రలను ఎంచుకుని మళ్లీ ఆడియెన్స్‌ను మెప్పిస్తాను అని తెలిపింది. దీంతో అప్పట్లో ఆమె ఫ్యాన్స్ అంతా రంభ రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. మరి రీ ఎంట్రీలో రంభ ఎలాంటి సినిమాలతో, ఎలాంటి పాత్రలతో వస్తుందో చూడాలి.