DJ Tillu – Mad : డీజే టిల్లు – మ్యాడ్ యూనివర్స్ లను కలుపుతున్న డైరెక్టర్..? టిల్లు క్యూబ్ లో మ్యాడ్ బాయ్స్..

మ్యాడ్ రెండు సినిమాలకు దర్శకుడు అయిన కళ్యాణ్ శంకర్ టిల్లు క్యూబ్ ని డైరెక్ట్ చేయబోతున్నాడు అని క్లారిటీ వచ్చేసింది.

DJ Tillu – Mad : డీజే టిల్లు – మ్యాడ్ యూనివర్స్ లను కలుపుతున్న డైరెక్టర్..? టిల్లు క్యూబ్ లో మ్యాడ్ బాయ్స్..

Makers Plans Mad Boys in Siddhu Jonnalagadda Tillu Cube Movie

Updated On : March 1, 2025 / 5:05 PM IST

DJ Tillu – Mad : ఇటివల సినిమాటిక్ యూనివర్స్ లు ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. సక్సెస్ అవుతున్న సినిమాలకు ఫ్రాంచైజ్ లాగా సీక్వెల్స్ తీయడం, ఒక హీరో సినిమాకి ఇంకో హీరో సినిమాకు లింకులు పెడుతూ సినిమాలపై ఆసక్తి పెంచుతూ సినిమాటిక్ యూనివర్స్ లు సృష్టిస్తున్నారు దర్శకులు. తాజాగా మరో కొత్త కాంబో వినిపిస్తుంది.

సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా వచ్చిన డీజే టిల్లు సినిమా పెద్ద హిట్ అయింది. దానికి సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ ఇంకా పెద్ద హిట్ అయి 100 కోట్లు కూడా కలెక్ట్ చేసింది. దీంతో టిల్లు క్యూబ్ కూడా అనౌన్స్ చేసారు. టిల్లు సినిమాలని సితార ఎంటర్టైన్మెంట్స్ లోనే నిర్మించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ లో గతంలో మ్యాడ్ అనే సినిమా వచ్చి పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్, సంతోష్ శోభన్, రామ్ నితిన్ మెయిన్ లీడ్స్ గా తెరకెక్కిన ఈ సినిమా పెద్ద హిట్ అయింది.

Also Read : Namit Malhotra : ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమాపై బాలీవుడ్ నిర్మాత విమర్శలు.. మా రామాయణం ప్రజల మనోభావాలు దెబ్బతీయదు..

మ్యాడ్ సీక్వెల్ మ్యాడ్ స్క్వేర్ కూడా ప్రకటించారు. ఈ సినిమా మార్చ్ 29న విడుదల కానుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో మ్యాడ్ – టిల్లు లను కలిపే ఆలోచన ఉందా అనే ప్రశ్న ఎదురవ్వగా నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. టిల్లు క్యూబ్ సినిమాకు డైరెక్టర్ మ్యాడ్ స్క్వేర్ డైరెక్టర్ కళ్యాణ్ శంకరే. అతను ఈ ముగ్గుర్ని టిల్లు క్యూబ్ లో పెడతాడో లేదో అతన్నే అడగండి అని అన్నారు. కళ్యాణ్ శంకర్ మాట్లాడుతూ.. వంశీ అన్న ఏం చెప్తే అదే. పెట్టమంటే పెడతాను అన్నారు.

Also Read : Manchu Vishnu – Pawan Kalyan : ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడే.. గెస్ట్ గా పవన్ కళ్యాణ్ ని అడుగుతా అంటున్న మంచి విష్ణు..

మ్యాడ్ రెండు సినిమాలకు దర్శకుడు అయిన కళ్యాణ్ శంకర్ టిల్లు క్యూబ్ ని డైరెక్ట్ చేయబోతున్నాడు అని క్లారిటీ వచ్చేసింది. దీంతో దర్శకుడు కళ్యాణ్ శంకర్ సినిమాకు హైప్ రావడానికి ఇంకాస్త ఫన్ పెంచడానికి మ్యాడ్ బాయ్స్ ముగ్గుర్ని టిల్లు క్యూబ్ లో తీసుకునే ఛాన్స్ ఉందనే తెలుస్తుంది. ఇదే జరిగితే సిద్దు జొన్నలగడ్డతో ఈ ముగ్గురు మ్యాడ్ బాయ్స్ కలిసి మాములు హడావిడి చేయరు. అప్పుడు సినిమాకు కూడా మరింత హైప్, కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ముగ్గురు మ్యాడ్ బాయ్స్ ని టిల్లు క్యూబ్ లో గెస్ట్ అప్పీరెన్స్ ఇప్పించి సరికొత్త సినిమాటిక్ యూనివర్స్ తయారు చేస్తారని తెలుస్తుంది.