Namit Malhotra : ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమాపై బాలీవుడ్ నిర్మాత విమర్శలు.. మా రామాయణం ప్రజల మనోభావాలు దెబ్బతీయదు..
నమిత్ అన్నది ప్రభాస్ ఆదిపురుష్ గురించే అని అందరూ భావిస్తున్నారు.

Bollywood Producer Namit Malhotra Indirect Counters on Prabhas Adipurush Movie
Namit Malhotra : ఇప్పటికే రామాయణం పై అన్ని సినీ పరిశ్రమలలో చాలా సినిమాలు వచ్చాయి. ఇంకా వస్తునే ఉన్నాయి. చివరగా రామాయణంపై బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ ఆదిపురుష్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా విజువల్స్, గ్రాఫిక్స్, కథనంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పటికి ఆదిపురుష్ గురించి టాపిక్ వస్తే దానికి వచ్చిన విమర్శల గురించే మాట్లాడతారు. ముఖ్యంగా నార్త్ లో సినిమాపై దారుణంగా ట్రోల్స్ వచ్చాయి.
ప్రస్తుతం మరో రామాయణం సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రణబీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నితీష్ తివారి దర్శకత్వంలో రామాయణం తెరకెక్కుతుంది. ఇందులో యశ్ రావణాసురుడిగా కనిపించబోతున్నాడని సమాచారం. ఈ సినిమాని బాలీవుడ్ నిర్మాత నమిత్ మల్హోత్రా, అల్లు అరవింద్, మరి కొంతమంది కలిసి నిర్మిస్తున్నారు.
తాజాగా బాలీవుడ్ నిర్మాత నమిత్ మల్హోత్రా తమ రామాయణం గురించి గొప్పగా చెప్తూ ఇండైరెక్ట్ గా ప్రభాస్ ఆదిపురుష్ పై విమర్శలు చేసారు.
నమిత మల్హోత్ర మాట్లాడుతూ.. రామాయణంకు ఆస్కార్ వస్తుందని నమ్ముతున్నాను. విజువల్స్ కు చాలా ప్రాధాన్యం ఇస్తున్నాము. అలాగే మన సినిమాని ఏ స్థాయిలో ప్రచారం చేసాం అనేది కూడా ముఖ్యం. ఆ విషయంలో మేము ప్రచారానికి ప్రాముఖ్యత ఇస్తాం. ఇటీవల ఓ అగ్రహీరో రామాయణం కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. దాన్ని దృష్టిలో పెట్టుకొనే మేము ఇంకా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇది సున్నితమైన కథ. ప్రజల మనోభావాలు దెబ్బ తినకుండా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నాం అని తెలిపారు.
Also Read : Manchu Vishnu : ఇంత మంచోడివి ఏంటి భయ్యా.. ఎంత నెగిటివిటీ చూపించినా పాజిటివ్ గా మంచు విష్ణు.. ట్వీట్ వైరల్..
దీంతో నమిత్ అన్నది ప్రభాస్ ఆదిపురుష్ గురించే అని అందరూ భావిస్తున్నారు. ఇటీవల రామాయణం కథతో వచ్చి విమర్శకు ఎదుర్కొంది అంటే ఆదిపురుష్ సినిమానే. ఆ సినిమాని ఉద్దేశించి ఆ సినిమాలా మనోభావాలు దెబ్బతీయము, విజువల్స్ విషయంలో జాగ్రత్తగా ఉంటాము అనడంతో ఇండైరెక్ట్ గా ఆదిపురుష్ సినిమాపై విమర్శలు చేసారని భావిస్తున్నారు.