Aadi Pinishetty : ‘రంగస్థలం’ లో రోహిణి గారు, సమంత ఏడుపు విని.. నేను చాలా భయపడ్డా.. అది చూసి మా నాన్న..

రంగస్థలం సినిమాలో ఆది పినిశెట్టి రామ్ చరణ్ కి అన్నయ్య పాత్రలో నటించాడు. ఈ సినిమాలో ఆది పినిశెట్టి పాత్ర చనిపోతుంది.

Aadi Pinishetty : ‘రంగస్థలం’ లో రోహిణి గారు, సమంత ఏడుపు విని.. నేను చాలా భయపడ్డా.. అది చూసి మా నాన్న..

Aadi Pinishetty interesting comments on Rangasthalam Scene

Updated On : March 1, 2025 / 5:48 PM IST

Aadi Pinishetty : హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు ఆది పినిశెట్టి. తాజాగా శబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హారర్ థ్రిల్లర్ గా శబ్దం సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆది పినిశెట్టి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రంగస్థలం సినిమా సమయంలో జరిగిన ఓ ఆసక్తికర సంఘటన తెలియచేసాడు.

రంగస్థలం సినిమాలో ఆది పినిశెట్టి రామ్ చరణ్ కి అన్నయ్య పాత్రలో నటించాడు. ఈ సినిమాలో ఆది పినిశెట్టి పాత్ర చనిపోతుంది. ఆ పాత్రకు అంత్యక్రియలు జరిగే సీన్స్ అన్ని ఓరయ్యో సాంగ్ లో చూపిస్తారు. ఆ సీన్స్, పాట చాలా ఎమోషనల్ గా ఉంటుంది. థియేటర్లో ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించింది. ఆ సినిమాలో ఆది, చరణ్ కు తల్లిగా రోహిణి నటించింది. ఇందులో సమంత హీరోయిన్ అని తెలిసిందే.

Also Read : DJ Tillu – Mad : డీజే టిల్లు – మ్యాడ్ యూనివర్స్ లను కలుపుతున్న డైరెక్టర్..? టిల్లు క్యూబ్ లో మ్యాడ్ బాయ్స్..

ఆది పినిశెట్టి తను చనిపోయిన తర్వాత జరిగిన సీన్స్ గురించి మాట్లాడుతూ.. నా పాత్ర చనిపోయాక నేను కళ్ళు మూసుకొని కూర్చున్నాను. నా చుట్టూ అందరూ ఏడుస్తుంటారు. సమంత, రోహిణి గారు అయితే నేను నిజంగానే చనిపోయినట్టు ఏడ్చారు. ఆ ఏడుపులు విన్నప్పుడు నాకు చాలా భయం వేసింది. మనం పోయాక అలాగే ఏడుస్తారేమో అని అనిపించింది. రోహిణి గారు ఆమె భర్త రఘువరన్ గారు చనిపోయింది గుర్తుచేసుకొని ఏడ్చారు అని చెప్పారు. థియేటర్లో ఆ సీన్ కి ప్రేక్షకులు కనెక్ట్ అయి ఏడ్చారు. మా నాన్నతో సినిమాకు వెళ్ళాను. ఆయన పెద్ద డైరెక్టర్, ఇలాంటి సీన్స్ చాలా చూసారు. అయినా ఆ సీన్ కి కనెక్ట్ అయి ఏడ్చేశారు. నేను ఆయన చెయ్యి పట్టుకొని పక్కనే ఉన్నాను, అది జస్ట్ సీన్, సినిమా అని అన్నాను. ఆ సినిమాకు అంతగా కనెక్ట్ అయ్యారు అని తెలిపారు.