Akanksha Chamola : పిల్లలు కావాలని అడిగినందుకు భర్తకు విడాకులు ఇచ్చిన నటి.. పిల్లలపై ఆసక్తి లేదంటూ వ్యాఖ్యలు..

సీరియల్ నటి ఆకాంక్ష చమోలా మరో సీరియల్ నటుడు గౌరవ్ ఖన్నాని ప్రేమించి 2016లో పెళ్లి చేసుకుంది. (Akanksha Chamola)

  • Published on- June 30, 2026 / 06:29 PM IST

Akanksha Chamola

Akanksha Chamola : బాలీవుడ్ లో చాలా మంది నటీనటులు ప్రేమించుకొని విడిపోవడాలు, పెళ్లి చేసుకొని విడిపోవడాలు కూడా సాధారణంగానే చూస్తారు. ఎవరికి వారు ఏదో ఒక కారణంతో తమ లైఫ్ పార్ట్నర్స్ తో విడిపోతున్నారు. తాజాగా బాలీవుడ్ సీరియల్ నటి ఆకాంక్ష చమోలా తన భర్తకు విడాకులు ఇవ్వడానికి చెప్పిన కారణం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.

సీరియల్ నటి ఆకాంక్ష చమోలా మరో సీరియల్ నటుడు గౌరవ్ ఖన్నాని ప్రేమించి 2016లో పెళ్లి చేసుకుంది. గత సంవత్సరం నుంచి వీరు విడివిడిగానే జీవిస్తున్నారు. ఆల్రెడీ విడాకులకు కూడా కోర్టులో అప్లై చేశారు. ప్రస్తుతం ఆకాంక్ష చమోలా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో వస్తున్న లాకప్ అనే టీవీ షోలో పాల్గొంటుంది. ఈ షోలో తాజాగా తన భర్తతో ఎందుకు విడిపోయిందో తెలిపింది.

Also Read : Virat Karna : శివుడి పాత్ర వేసి.. హాస్పిటల్‌లో జాయిన్ అయిన హీరో.. ‘నాగబంధం’ కష్టాలు..

ఆకాంక్ష చమోలా మాట్లాడుతూ.. మా పెళ్లి జరిగే సమయానికే నాకు తల్లి అవ్వడం అనే దానిపై ఆసక్తి ఉండేది కాదు. కానీ భవిష్యత్తులో నా ఆలోచనలు మారతాయేమో అని పెళ్లి చేసుకున్నాను. పెళ్లి అయిన కొన్నాళ్ళకు కూడా నా ఆలోచనలు మారలేదు. అప్పుడు నేను గౌరవ్ కి పిల్లలు వద్దు అనుకుంటున్నట్టు చెప్పాను. అప్పుడు ఓకే అన్నాడు. కానీ గత కొంతకాలంగా గౌరవ్ తనకు పిల్లలు కావాలని, ఒక మంచి కుటుంబం ఉండాలని అడుగుతున్నాడు.

నాకు పిల్లల్ని కనాలని ఆసక్తి లేదు. ఆయనకు కావాల్సింది నేను ఇవ్వలేను. ఇదే కారణంతో విడిపోదాం అనుకుంటే నాకు ఓకే అని గౌరవ్ కి చెప్పాను. అందుకే ఈ కారణంతోనే మేము విడిపోయాము అని తెలిపింది. దీంతో ఆకాంక్ష చమోలా కామెంట్స్ వైరల్ గా మారి సోషల్ మీడియాలో చర్చగా మారాయి. ఈ కామెంట్స్ పై పలువురు నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు.