Virat Karna : శివుడి పాత్ర వేసి.. హాస్పిటల్లో జాయిన్ అయిన హీరో.. ‘నాగబంధం’ కష్టాలు..
జులై 3న ఈ సినిమా రిలీజ్ అవుతుండగా నేడు మీడియాతో మాట్లాడుతూ నాగబంధం సినిమా మేకింగ్ లో తాను పడ్డ కష్టాలను తెలిపాడు విరాట్ కర్ణ. (Virat Karna)
Virat Karna
Virat Karna : పెదకాపు సినిమాతో హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విరాట్ కర్ణ ఇప్పుడు నాగబంధం సినిమాతో రాబోతున్నాడు. 100 కోట్ల భారీ బడ్జెట్ తో పీరియాడిక్, మైథాలజీ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో విరాట్ కర్ణ శివుడి పాత్రతో పాటు రుద్ర అనే పాత్రలో కనిపించబోతున్నాడు. జులై 3న ఈ సినిమా రిలీజ్ అవుతుండగా నేడు మీడియాతో మాట్లాడుతూ నాగబంధం సినిమా మేకింగ్ లో తాను పడ్డ కష్టాలను తెలిపాడు విరాట్ కర్ణ.
Also Read : Akhil Raj : మా అమ్మని తిట్టాడు.. తాగి వచ్చాడు.. డెలివరీ బాయ్ ఇష్యూపై స్పందించిన హీరో అఖిల్..
విరాట్ కర్ణ మాట్లాడుతూ.. ఈ సినిమాలో రుద్ర పాత్రతో పాటు శివుడిగా కనిపించబోతున్నాను. రుద్ర పాత్ర కోసం 20 కేజీలు పెరిగాను. మళ్ళీ శివుడి పాత్ర కోసం 5 కేజిలు తగ్గాను. శివుడి పాత్ర కోసం చాలా కష్టపడ్డాను. డిసెంబర్ చలికాలంలో హైదరాబాద్ లో బయట ఓపెన్ సెట్స్ రాత్రి పూట షూటింగ్ పెట్టారు. శివుడి గెటప్ వేసుకొని ఆ చలిలో వణికిపోయాను. అప్పటికి జ్వరం వచ్చింది అయినా నాకు తాళ్లు కట్టి రెండొందల అడుగులు పైకి లేపారు ఒక సీన్ కోసం. నాకు కళ్ళు తిరిగిపోయాయి. రెండు రోజులు అలాగే చలిలో, జ్వరంతోనే, రాత్రి పూట నిద్ర లేకుండా, వణికిపోతూ షూట్ చేశాను. తాళ్లు కట్టడంతో రక్తం కూడా వచ్చింది.
మూడో రోజు కిందకు దింపాక పరిగెత్తుకుంటూ వెళ్లి కారవాన్ లో పడిపోయాను. నన్ను వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లారు. హాస్పిటల్ లో సెలైన్ ఇచ్చి పడుకోపెట్టారు. డెంగ్యూ లక్షణాలు ఉన్నాయన్నారు. నేను డోలో ట్యాబ్లేట్ వేసుకొని నెక్స్ట్ డే షూటింగ్ కి రెడీ అయిపోయాను. ఈ సినిమా కోసం బాడీ పెంచి, తగ్గించి ప్రయోగాలు చేయడంతో ఆరోగ్య సమస్యలు వచ్చాయి. షూటింగ్ అయిపోగానే జిమ్ కూడా ఆపేసాను. క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ లో చాలా గాయాలు అయ్యాయి అని తెలిపాడు.
Also Read : Shanaya Kapoor : టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న జాన్వీ కపూర్ చుట్టం.. షేక్ చేయబోతున్న శనయ కపూర్..
