Shanaya Kapoor : టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న జాన్వీ కపూర్ చుట్టం.. షేక్ చేయబోతున్న శనయ కపూర్..
జాన్వీ కపూర్ కి చెల్లి వరస అయ్యే శనయ కపూర్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిందని సమాచారం.

టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న జాన్వీ కపూర్ చుట్టం.. షేక్ చేయబోతున్న శనయ కపూర్..

బాలీవుడ్ లో అనేక సీనియర్ స్టార్స్ వారసులు ఎంట్రీ ఇస్తున్నారు. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోను ఎంట్రీ ఇస్తున్నారు బాలీవుడ్ కొత్త తరం నటీనటులు.

ఇప్పటికే జాన్వీ కపూర్ టాలీవుడ్ లో సినిమాలు చేయగా ఇప్పుడు జాన్వీ కపూర్ కి చెల్లి వరస అయ్యే శనయ కపూర్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిందని సమాచారం.

జాన్వీ కపూర్ తండ్రి బోణి కపూర్ సోదరుడు సంజయ్ కపూర్ కూతురే ఈ శనయ కపూర్..

శనయ ఇప్పటికే బాలీవుడ్ లో హీరోయిన్ గా ఆఖోంకి గుస్తాకియా, తు యా మై.. అనే రొమాంటిక్ లవ్ సినిమాలతో పాటు, భేదడక్, స్క్రూ ఢీలా అనే సినిమాల్లో నటించింది.

ఇప్పుడు ఈ బాలీవుడ్ భామ టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుంది.

తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన జాంబి రెడ్డి సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.

జాంబిరెడ్డి సినిమాకు సీక్వెల్ కూడా ప్రకటించారు. ఆ సీక్వెల్ సినిమాలో శనయ కపూర్ హీరోయిన్ గా నటిస్తుందట.

ఈ సినిమాని ప్రశాంత్ వర్మ కాకుండా తన ఆధ్వర్యంలో మరో దర్శకుడు డైరెక్ట్ చేస్తున్నాడట. ఆల్రెడీ షూటింగ్ మొదలయిందని, తేజసజ్జ, శనయకపూర్ మధ్య సీన్స్ షూటింగ్ కూడా అయిందని టాలీవుడ్ టాక్.











Shanaya Kapoor
