Airtel Recharge Plans : రూ.299 ప్లాన్‌కు గుడ్‌బై! ఎయిర్టెల్ యూజర్లకు బిగ్ షాక్.. 6 పాపులర్ ప్లాన్లు ఔట్..
Airtel Recharge Plans : ఎయిర్టెల్ రూ. 299, రూ. 319, రూ. 579, రూ. 619, రూ. 649, రూ. 799 సహా పాపులర్ ప్రీపెయిడ్ ప్లాన్లను ఎత్తేసింది. అన్నింటికన్నా చౌకైన రూ. 299 ప్లాన్ ఇక అందుబాటులో ఉండదు.
Airtel Recharge Plans
- 6 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు ఎత్తేసిన ఎయిర్టెల్
- అత్యంత చౌకైన రూ. 299 ప్లాన్ ఇక లేనట్టే
- కొత్త రీఛార్జ్ ప్లాన్లు, బెనిఫిట్స్, ధర వివరాలివే
Airtel Recharge Plans : ఎయిర్టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లకు బిగ్ షాక్ తగిలింది. కంపెనీ రీచార్జ్ పోర్ట్‌ఫోలియోలో కీలక మార్పులు చేసింది. యూజర్లకు అందుబాటు ధరలో ఉన్న కొన్ని పాపులర్ ప్రీపెయిడ్ ప్లాన్లను ఎత్తేసింది. ముఖ్యంగా రూ. 299, రూ. 319, రూ. 579, రూ. 619, రూ. 649, రూ. 799 ప్లాన్లు అందుబాటులో లేవు. మీ సర్కిళ్లలో కూడా ఈ ఎయిర్ టెల్ రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయో లేదో ఓసారి చెక్ చేసుకోండి.
రూ. 299 ప్లాన్ ఇక లేదు :
తక్కువ బడ్జెట్లో ఎక్కువ బెనిఫిట్స్ కోరుకునే యూజర్లకు రూ. 299 ప్లాన్ బెస్ట్ ఆప్షన్. ఈ ప్యాక్‌లో 28 రోజుల (Airtel Recharge Plans) వ్యాలిడిటీ, రోజుకు 1GB డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS, హాలో ట్యూన్స్ వంటి బెనిఫిట్స్ ఉండేవి. ఇప్పుడు ఈ ప్లాన్ తొలగించడంతో ఇలాంటి బెనిఫిట్స్ కోసం యూజర్లు ఇకపై ఎక్కువ ధర చెల్లించాల్సిందే..
రూ. 579, రూ. 619, రూ. 649 కూడా ఔట్ :
రూ. 579, రూ. 619 ప్లాన్లు దేశంలోని అన్ని టెలికం సర్కిళ్లలో ఒకేలా అందుబాటులో లేవు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి కొన్ని సర్కిళ్లలో ఈ ప్లాన్లు అందుబాటులో లేన్నట్టు సమాచారం. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఇంకా అందుబాటులో ఉండే ఛాన్స్ ఉంది. రూ. 619 ప్లాన్‌లో 60 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, 100 SMS బెనిఫిట్స్ లభించేవి. రూ. 649 ప్లాన్‌లో 56 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2GB డేటా వంటి బెనిఫిట్స్ ఉన్నాయి.
Read Also : TRAI New Rules : TRAI కొత్త రూల్స్.. 1601 నుంచి కాల్ వస్తే ఆన్సర్ చేయాలా? ఇదిగో ఫుల్ క్లారిటీ!
రూ. 859 ఇప్పుడు రూ. 899 :
రీఛార్జ్ ప్లాన్ల తొలగింపు మాత్రమే కాదు.. ఎయిర్టెల్ మరో ప్లాన్ ధరలో కూడా మార్పు చేసింది. రూ. 859 ప్లాన్ ధరను రూ. 899కు పెంచింది. అయితే, అదనపు బెనిఫిట్స్ లేకుండానే ఈ ధర పెంపుతో యూజర్లకు మరింత భారంగా మారింది. రూ. 899 ప్లాన్‌లో 84 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 1.5జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, 100 SMS బెనిఫిట్స్ ఉన్నాయి.
5G ఎఫెక్ట్ కారణమా? :
ఎయిర్టెల్ రీఛార్జ్ ప్లాన్ల మార్పుకు 5జీనే కారణమని కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. అయితే, దేశంలో 5జీ సేవలను విస్తరిస్తున్న సమయంలో 4జీ, 5జీ ప్లాన్లు, నెట్ వర్క్ క్వాలిటీ, ప్రీమియం సర్వీసులపై టెలికాం రంగంలో చర్చ పెరుగుతోంది.
మరోవైపు, 4G, 5G ప్లాన్లు రెండూ అందుబాటులో ఉండాలని, అలాగే యూజర్లకు ఈ రెండింటి మధ్య ఆప్షన్ చేసుకునే ఛాన్స్ కూడా ఇవ్వాలని టెలికాం ప్రొవైడర్లకు ట్రాయ్ సూచించింది. అయితే, ఈ టెలికాం సంస్థలు నెట్వర్క్ ప్రీమియం స్లైసింగ్‌ను ఎలా నిర్వహిస్తాయి? అలాగే 4G ప్లాన్లలో స్టేబుల్ స్పీడ్ కొనసాగించగలవో లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
ఒకవేళ కస్టమర్లను సేవలను అందించడంలో విఫలమైతే అన్ని టెలికాం సంస్థలు భారీ జరిమానాలను ఎదుర్కోవలసి వస్తుందని కూడా ట్రాయ్ ప్రకటించింది. అందుకే రాబోయే రోజుల్లో రీఛార్జ్ ధరలు, బెనిఫిట్స్ సంబంధించి మరిన్ని మార్పులు ఉంటాయా లేదో చూడాలి.
