Akash Puri
Akash Puri: మెహబూబ్ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ నుండి మెయిన్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆకాష్ పూరికి మంచి సాలిడ్ హిట్ సినిమా కావాలి. దీనికోసం పూరి జగన్నాధ్ స్వయంగా రంగంలోకి దిగి దర్శకత్వం తప్ప అన్నీ తానై రొమాంటిక్ అనే సినిమాను తెరకెక్కించారు. అయితే.. కరోనా ప్రభావంతో అది ఎప్పటికి బయటకి వస్తుందో అర్ధం కాలేదు. అయితే.. ఈలోగా ఆకాష్ మాత్రం యాక్షన్ బాట పట్టాడు. చోర్ బజార్ పేరుతో కొత్త సినిమా మొదలు పెట్టాడు.
‘దళం, జార్జ్ రెడ్డి’ సినిమాలతో తన మార్కు క్రియేట్ చేసుకున్న జీవన్ రెడ్డి ఈ చోర్ బజార్ సినిమాకు దర్శకుడు. హీరోయిన్ గా గెహన సిప్పీ నటిస్తోంది. ఐ.వి ప్రొడక్షన్స్ పతాకంపై వి.ఎస్ రాజు తన తొలి ప్రయత్నంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ‘చోర్ బజార్’ సినిమాకు బచ్చన్ సాబ్ ఆగాయా అనే ట్యాగ్ లైన్ పెట్టారు. హీరో ఆకాష్ బర్త్ డే సందర్భంగా మూవీ టీమ్ ఆదివారం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను విడుదల చేసింది.
టైటిల్ కు తగ్గట్టే ఫస్ట్ లుక్ మాస్ గా ఉంది. హీరో ఆకాష్ చేతిమీద ‘బచ్చన్ సాబ్’ పేరుతో టాటుతో బైక్ పక్కన నిలబడి పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. పక్కా మాస్ ఎలిమెంట్లతో ఈ సినిమా రూపొందుతుందని తాజా పోస్టర్‌ని చూస్తుంటే అర్థమవుతుంది. హీరో చేత్తో గన్ ఫైరింగ్ చేస్తుండగా. చోర్ బజార్ లో ఉండే అన్నీ ఈ మోషన్ పోస్టర్ లో కనిపిస్తున్నాయి. దీనికి సురేష్ బొబ్బిలి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్ ఫెక్ట్ గా సూట్ అయింది.
??? Bachan Saab Aagayaa ??
Here's the Dhamaakedaar First Look & Motion Poster of @ActorAkashPuri from #ChorBazaar ?https://t.co/A3VmOh7xXD
A @GeorgeReddyG1 ?@VSRajuOfficial @IVProductions_ @anwaraliedit @sureshvarmaz @DPrasannavarma @GskMedia_PR #HBDAakashPuri pic.twitter.com/7q6gVR1vBM
— I V Productions (@IVProductions_) July 25, 2021